ఫాస్టెస్ట్ కంప్యూటింగ్ దీని సొంతం!!

Posted By: Prashanth

ఫాస్టెస్ట్ కంప్యూటింగ్ దీని సొంతం!!

 

కంప్యూటింగ్ పరికరాల తయారీ సంస్థ BLU అంతర్జాతీయంగా తన పరిధిని విస్తరించుకునే క్రమంలో టచ్ బుక్ 7.0 నమూనాలో టాబ్లెట్ పీసీని వ్ళద్థి చేసింది. లాటిన్ అమెరికా ప్రాంతంలో బలమైన సంస్థగా గుర్తింపుతెచ్చుకున్న BLU, ఆనలైన్ రిటైలర్ల ద్వారా వ్యాపార లావాదేవీలను నిర్వహిస్తుంది. ఆండ్రాయిడ్ ఆధారితంగా పనిచేసే టచ్ బుక్ 7.0 ఉత్తమమైన హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ వ్యవస్థలను కలిగి ఉంది. డివైజ్‌లో నిక్షిప్తం చేసిన ఫీచర్లు:

* ఆండ్రాయిడ్ 2.2 ఫ్రోయో ఆపరేటింగ్ సిస్టం, * జీఎస్ఎమ్ నెట్ వర్క్ సపోర్ట్, * చిప్ సెట్ తో కూడిన క్వాల్కమ్ MSM7227-T ప్రాసెసర్ (వేగం 800 MHz), * 7 అంగుళాల టచ్ స్ర్కీన్ డిస్ ప్లే, * 512ఎంబీ ర్యామ్, * 512ఎంబీ రోమ్, * ఎక్సటర్నల్ మెమరీ 32జీబి, * డివైజ్ ఇంటర్నెట్ వేగాన్ని మరింత పెంచేందుకు ఏర్పాటు చేసిన జీపీఆర్ఎస్, ఎడ్జ్, వై-ఫై వ్యవస్థలు తోడ్పడతాయి, * బ్లూటూత్, యూఎస్బీ కనెక్టువిటీ వ్యవస్థలు, * 3.15 మెగా పిక్సల్ రేర్ కెమెరా, * వీడియో రికార్డింగ్ సౌలభ్యత, * బ్యాటరీ స్టాండ్ బై 500 గంటలు, * ధర రూ.12,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot