చౌక ధర టాబ్లెట్‌తో పాటు అధ్బుతమైన డేటా ప్లాన్

Posted By: Prashanth

చౌక ధర టాబ్లెట్‌తో పాటు అధ్బుతమైన డేటా ప్లాన్

 

భారత దేశపు టెలికాం సంస్ద భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బిఎస్‌ఎన్‌ఎల్‌) తాజాగా మూడు చౌక ధరలు కలిగిన ట్యాబ్లెట్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. అండ్రాయిడ్‌ 2.3 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో రన్ అయ్యే రెండు ట్యాబ్లెట్‌లు ఏడు ఇంచుల పరిధిలో టచ్‌ స్క్రీన్‌ కలిగిన ట్యాబ్లెట్‌తో పాటు మరో 8 ఇంచులు కలిగిన ట్యాచ్‌ స్క్రీన్‌ ట్యాబ్లెట్‌ను విడుదల చేసింది. ఇందులో అత్యంత చౌక అయినా టిపాడ్‌ మోడల్‌ బిఎస్‌ఎన్‌ఎల్‌ బ్రాండ్‌తో మార్కెట్లోకి వస్తుంది. దీని ధర రూ 3,250గా ఉండనుందని సమాచారం. నోయిడా కేంద్రంగా నడస్తోన్న పంటెల్‌ కంపెనీ రూపొందించిన ఈ మూడు ట్యాబ్లెట్‌ను డిస్కౌంట్‌ ధరల్లో బిఎస్‌ఎన్‌ఎల్‌ అందించడానికి ముందుకు వచ్చింది.

అత్యంత చౌక ధర కలిగిన టిపాడ్‌ ఐఎస్‌ 701ఆర్‌ మోడల్‌ను రూ.3,250కి విక్రయించనుంది. ఆకాశ్‌ రూ.2500 ధర కలిగినప్పటికీ, టిపాడ్‌లో అధనపు సౌకర్యాలున్నాయని బిఎస్‌ఎన్‌ఎల్ ప్రతినిధులు తెలిపారు. పంట టిపాడ్‌ ట్యాబ్లెట్‌ అండ్రాయిడ్‌ 2.3 నిర్వహణ పద్దతి కలిగి ఉండటంతో పాటు హై డెపిషిస్‌ కలిగి ఉంది. ఏడు ఇంచులు పరిధి టచ్‌స్క్రీన్‌ కలిగి ఉన్న దీనికి టివిని కూడా కనెక్టు చేసుకునే సౌలభ్యం ఉంది. ఈ టాబ్లెట్‌తో పాటు బిఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులకు రూ 3, 499 డేటా ప్లాన్‌ని విడుదల చేయనుంది.

ఈ టాబ్లెట్ల్‌ని కొనుగోలు చేసిన వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వారు కేవలం రూ 750 రీఛార్జీ ద్వారా 60 రోజులకు 5జిబి ప్లాన్‌ని సొంతం చేసుకోవచ్చని బిఎస్‌ఎన్‌ఎల్ అధికారులు తెలిపారు. ఈ డేటా ప్లాన్ మే 31 వరకు వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot