బీఎస్ఎన్ఎల్ పూర్తి టాక్‌టైమ్ ఆఫర్లు

Posted By:

బీఎస్ఎన్ఎల్ పూర్తి టాక్‌టైమ్ ఆఫర్లు

రాబోయే క్రిస్టమస్, సంక్రాంతి పండుగలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఆంధ్రప్రదేశ్ వినియోగదారుల కోసం ‘ఫెస్టివల్ ఫుల్ టాక్‌టైమ్ ఆఫర్‌'ను ఆవిష్కరించింది. ఈ ఆఫర్‌లో పలు రీఛార్జుల పై పూర్తి టాక్‌టైమ్‌ను అందిస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ ఏపీ టెలికాం సర్కిల్ ఒక ప్రకటనలో పేర్కొంది.

ఈ ప్రత్యేకమైన ఫెస్టివల్ ఆఫర్‌లో భాగంగా ఈ నెలాఖరు వరకు రూ.100 నుంచి 190 రీఛార్జ్ కూపన్ల పై పూర్తి టాక్‌టెమ్‌ను పొందవచ్చు. అలాగే, రూ.220 కూపన్ల పై మార్చి 16 వరకు, రూ.550 కూపన్ల పై మార్చి 3 వరకు పూర్తి టాక్‌టెమ్‌ను అందిస్తామని బీఎస్ఎన్ఎల్ తెలిపింది.

త్వరలో మరో 550 టవర్లు - యునినార్

తమ ఏపీ సర్కిల్ పరిధిలో కొత్తగా మరో 550 టవర్లను ఏర్పాటు చేసుకోవటం ద్వారా తమ మొబైల్ నెట్‌వర్కింగ్ సేవలను మరిన్ని గ్రామాలు, పట్టణాలకు విస్తరిస్తామని యునినార్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ వ్యాపారాధిపతి సతీశ్ కన్నన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రస్తుతం తమకు రాష్ట్రవ్యాప్తంగా 2900 టవర్లు ఉన్నాయిని వీటి ద్వారా 2,568 పట్టణాలు, గ్రామాల్లో తమ సేవలను వినియోగించుకుంటున్నాని ఆయన వెల్లడించారు. వచ్చే ఏడాది జనవరి నుంచి మే నెలలోపు కొత్తగా నెలకొల్పే టవర్లతో మరో 132 పట్టణాలు, గ్రామాలకు తమ సర్వీసులు చేరువవుతాయని ఆయన తెలిపారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot