బీఎస్ఎన్ఎల్ భాగస్వామ్యంతో రాష్ట్ర మార్కెట్లోకి 3జీ ఆఫర్లతో పాంటెల్ టాబ్లెట్ పీసీలు!

Posted By: Prashanth

బీఎస్ఎన్ఎల్ భాగస్వామ్యంతో రాష్ట్ర మార్కెట్లోకి 3జీ ఆఫర్లతో పాంటెల్ టాబ్లెట్ పీసీలు!

 

హైదరాబాద్: ఐన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగానికి హార్డ్‌వేర్ పరికరాలను సమకూరుస్తున్న పాంటెల్ టెక్నాలజీస్ ‘పెంటా టి-ప్యాడ్’ బ్రాండ్ క్రింద రెండు సరికొత్త టాబ్లెట్ పీసీలను బీఎస్ఎన్ఎల్ భాగస్వామ్యంతో శుక్రవారం రాష్ట్ర మార్కెట్లో ఆవిష్కరించింది. ఐఎస్703సీ ( IS703C), డబ్ల్యూఎస్802సీ(WS802C) మోడళ్లలో డిజైన్ కాబడిన ఈ కంప్యూటింగ్ పీసీల పై బీఎస్ఎన్ఎల్ ప్రత్యేక ఆఫర్‌లను కల్పించింది.

ఐఎస్703సీ మోడల్‌ను రూ.7,499చెల్లించి కొనుగోలు చేసే పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు రూ.1500 విలువగల బీఎస్ఎన్ఎల్ 3జీ యూఎస్‌బీ డాంగిల్‌తో పాటు రూ.1500 విలువ చేసే 12జీబి 3జీ డేటా ఉచితం. వ్యాలిడిటి మూడు నెలలు. డివైజ్ ఫీచర్ల విషయానికొస్తే....

ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

1గిగాహెడ్జ్ కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్,

7 అంగుళాల మల్టీటచ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,

1జీబి ర్యామ్,

8జీబి ఇంటర్నల్ మెమెరీ.

మరో మోడల్ అయిన డబ్ల్యూఎస్802సీ టాబ్లెట్‌ను రూ.14,999 చెల్లించి సొంతం చేసుకున్నవారికి బండిల్ ఆఫర్‌లో భాగంగా రూ.150 విలువైన 3జీ సిమ్, 60 రోజుల వ్యాలిడిటీతో రూ.750 విలువ చేసే 4జీబీ 3జీ డేటాను బీఎస్ఎన్ఎల్ ఉచితంగా అందించనుంది. డివైజ్ ఫీచర్ల విషయానికొస్తే....

6 గంటల బ్యాటరీ బ్యాకప్,

వై-ఫై, బ్లూటూత్,

2జీ/3జీ సిమ్ స్లాట్,

యూఎస్బీ డాంగిల్ సపోర్ట్,

ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటంగ్ సిస్టం,

8 అంగుళాల 5 పాయింట్ మల్టీ‌టచ్ కెపాసిటివ్ స్ర్కీన్,

2 మెగా పిక్పల్ కెమెరా,

0.3 మెగా పిక్సల్ కెమెరా (వీడియో రికార్డింగ్ నిర్వహించుకునేందుకు),

4జీబి ఇంటర్నల్ మెమెరీ,

32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమరీ,

1గిగాహెడ్జ్ ప్రాసెసర్,

512ఎంబీ ర్యామ్,

వై-ఫై.

రాష్ట్రవ్యాప్తంగా నెలకు 10,000 టాబ్లెట్‌లను విక్రయిస్తున్నట్లు పాంటెల్ టెక్నాలజీస్ సంచాలకులు వివేక్ ప్రకాశ్ ఈ సందర్భంగా పాత్రికేయులకు తెలిపారు. ఇప్పటి వరకు రిటైల్ మార్కెట్లో దేశవ్యాప్తంగా 1.27లక్షల టాబ్లెట్‌లను విక్రయించామని ఆయన పేర్కొన్నారు. టెరాకామ్, విష్‌టెల్ బ్రాండ్ ట్యాబ్లెట్లనూ విక్రయిస్తున్నామని బీఎస్‌ఎన్‌ఎల్ ఏపీ సర్కిల్ సీజీఎం వి.శ్రీనివాసన్ తెలిపారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot