మాస్ హిరో సపోర్ట్‌తో.. జనంలోకి!

ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ సహకారంతో పాంటెల్ టెక్నాలజీస్ ఆండ్రాయిడ్ ఆధారిత టాబ్లెట్ పీసీని దేశీయ విపణిలో ఆవిష్కరించింది. ‘బీఎస్ఎన్ఎల్ పెంటా టీ-ప్యాడ్ IS701C’ మోడల్‌లో డిజైన్ కాబడిన ఈ కంప్యూటింగ్ గ్యాడ్జెట్ ధర రూ.4,999. దేశంలోని గ్రామీణ ప్రాంత ప్రజలకు కంప్యూటింగ్ పరిజ్ఞానాన్ని మరింత చేరువ చేసే క్రమంలో వీటిని వృద్ధి చేసినట్లు తెలుస్తోంది. గ్రామిణ ప్రాంతాల్లో ఉత్తమ
నెట్‌వర్క్‌గా గుర్తింపుతెచ్చుకున్న బీఎస్ఎన్ఎల్ ఈ పీసీలను ప్రజల్లోకి తీసుకెళ్లనుంది.
ఫీచర్లు:
7 అంగుళాల మల్టీటచ్ డిస్‌ప్లే(రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్,
512ఎంబీ ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
వై-ఫై కనెక్టువిటీ,
3జీ యూఎస్బీ డాంగిల్ సపోర్ట్,
0.3మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఫ్రీలోడెడ్ అప్లికేషన్స్ (ట్విట్టర్, ఫేస్‌బుక్, స్కైప్, యాంగ్రీ బర్డ్స్),
6 గంటల బ్యాటరీ బ్యాకప్.
బీఎస్ఎన్ఎల్, పాంటెల్ టెక్నాలజీ సంయుక్త ఆధ్వర్యంలో గడిచిన మార్చిలో మూడు టాబ్లెట్ పీసీలు విడుదలయ్యాయి. వాటి పేర్లు:
బీఎస్ఎన్ఎల్ టీ-ప్యాడ్ ఐఎస్701ఆర్ (ధర రూ.3,250),
బీఎస్ఎన్ఎల్ టీ-ప్యాడ్ డబ్ల్యూఎస్704సీ (ధర రూ.10,999),
బీఎస్ఎన్ఎల్ టీ-ప్యాడ్ డబ్ల్యూఎస్802సీ(ధర రూ.13,500).


Click it and Unblock the Notifications








