బీఎస్ఎన్ఎల్ చవక కంప్యూటర్, ఇంటర్నెట్‌తో!!

Posted By:

బీఎస్ఎన్ఎల్ చవక కంప్యూటర్, ఇంటర్నెట్‌తో!!

 

దేశ వ్యాప్తంగా టాబ్లెట్ కంప్యూటర్ల వినియోగం రెట్టింపవటంతో ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ కొత్త పంధాతో ముందుకు వచ్చింది. వినియోగదారులకు మరింత చేరువయ్యే క్రమంలో మూడు రకాల చౌక టాబ్లెట్ పీసీలను మార్కెట్లో విడుదల చేసింది. నోయిడాకు చెందిన ప్యానటెల్ సంస్థ రూపొందించిన ఈ టాబ్లెట్ కంప్యూటర్లు రూ.3,250 రూ.10,999, రూ.13,500, ధరల్లో లభ్యం కానున్నాయి. రెసిస్టివ్ స్క్రీన్, ఆండ్రాయిడ్ 2.3 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ టాబెట్లు 7- 8 అంగుళాల స్క్రీన్ సైజుల్లో రూపుదిద్దుకున్నాయి.

మొదటి మోడల్ టీ-ప్యాడ్ ఐఎస్701ఆర్‌లో 1 గిగాహెడ్జ్ ప్రాసెసర్, 256ఎం ర్యామ్, వైఫై ఎనేబుల్డ్, బిల్టిన్ 2జీబీ మెమొరి(32 జీబీ వరకూ విస్తరించుకోవచ్చు) వంటి ప్రత్యేకతలున్నాయి. ఇక రెండో మోడల్, టీ-ప్యాడ్ డబ్ల్యూఎస్704సీలో 512 ఎంబీ, డీడీఆర్‌త్రీ ర్యామ్ వంటి ఫీచర్లున్నాయి. దీనిని హెచ్‌డీఎంఐ కేబుల్ ద్వారా టీవీకి కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక మూడో మోడల్ ఖరీదైనది-టీ-ప్యాడ్ డబ్ల్యూఎస్802సీలో 1.2 గిగాహెడ్జ్ ప్రాసెసర్, 512 ఎంబీ డీడీత్రీ ర్యామ్, బిల్టిన్ గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ వంటి ప్రత్యేకతలున్నాయి.

తక్కువ ఛార్జీల డేటా ప్లాన్లతో బీఎస్‌ఎన్‌ఎల్ వీటిని విక్రయిస్తుందని సమాచారం.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot