చవక ధరకే ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ టాబ్లెట్ కంప్యూటర్!!!

కంప్యూటింగ్ గ్యాడ్జెట్‌ల ఉత్పాదక సంస్థ వెలాసిటీ మైక్రో (Velocity Micro) గడిచిన ఏడాది అనేక వేరింయట్‌లలో డ్యూయల్ కోర్ ఆండ్రాయిడ్ టాబ్లెట్ కంప్యూటర్‌లను ప్రవేశపెట్టింది. మార్కెట్లో ఈ పీసీలు సక్సెస్ టాక్ తెచ్చుకోవటంతో భవిష్యత్త్ కార్యచరణను మరింత బలోపేతం చేసే దిశగా ఈ బ్రాండ్ అడుగుడు వేస్తుంది. వినియోగదారుడికి లబ్ధి చేకూర్చే విధంగా మన్నికైన ఫీచర్లతో కూడిన టాబ్లెట్ కంప్యూటర్ లను సమంజసమైన ధరలకే అందించేందుకు ‘వెలాసిటీ మైక్రో’ ప్లాన్ చేసింది. లేటెస్ట్ ఆండ్రాయిడ్ వర్షన్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ వోఎస్ పై పని చేసే టాబ్లెట్ పీసీలను ఈ సంస్థ డిజైన్ చేసింది. ‘క్రజ్ T507’, ‘క్రజ్ T510’ నమూనాలలో రూపుదిద్దుకున్న ఈ టాబ్లెట్ పీసీల ఫీచర్లు......
క్రజ్ T507 ముఖ్య ఫీచర్లు:
* శక్తివంతమైన కార్టెక్స్ ప్రాసెసర్, * 400 MHz ARM Mali గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, * ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, * ర్యామ్ 512 ఎంబీ, * ఇంటర్నెల్ మెమరీ 8జీబి, * 7 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే, * హెచ్డీఎమ్ఐ అవుట్, * ఆమోజోన్స్ అప్లికేషన్ స్టోర్, * ధర రూ.8,000.
క్రజ్ T510 ప్రధాన ఫీచర్లు:
* శక్తివంతమైన కార్టెక్స్ ప్రాసెసర్, * 400 MHz ARM Mali గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, * ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, * ర్యామ్ 512 ఎంబీ, * ఇంటర్నెల్ మెమరీ 8జీబి, * 9.7 అంగుళాల టచ్ స్ర్కీన్ డిస్‌ప్లే, * హెచ్డీఎమ్ఐ అవుట్, * ఆమోజోన్స్ అప్లికేషన్ స్టోర్, * డ్యూయల్ కెమెరా వ్యవస్థ, * ధర రూ.15,000.


Click it and Unblock the Notifications








