బియాండ్ ఐసీఎస్ టాబ్లెట్స్ (అంచనాలకు భిన్నంగా..)

Posted By: Prashanth

బియాండ్ ఐసీఎస్ టాబ్లెట్స్ (అంచనాలకు భిన్నంగా..)

 

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ ‘బియాండ్ టెక్’ దేశీయ మార్కెట్లో సరికొత్త శ్రేణి టాబ్లెట్ పీసీలను ఆవిష్కరించింది. మైబుక్ సిరీస్ నుంచి డిజైన్ కాబడిన టాబ్లెట్ కంప్యూటర్‌లను ప్రముఖ బాలివుడ్ తార జరీన్ ఖాన్ ఆవిష్కరించగా, ఇదే వేదిక పై సంస్థ డిజైన్ చేసిన సరికొత్త స్మార్ట్‌ఫోన్ ‘బి-50’ని బియాండ్ టెక్ సంచాలకులు మనీష్ జెయిన్ లాంచ్ చేసారు. ఈ సందర్భంగా కంపెనీ సీఈవో ప్రశాత్ బోరా మాట్లాడుతూ మైబుక్ టాబ్లెట్‌లను పది వర్షన్‌లలో ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. 3డి స్ర్కీన్‌లను కలిగి ఉండే ఈ పీసీల ధరలు రూ.4,300 నుంచి రూ.11,000లో శ్రేణిల్లో ఉంటాయన్నారు. 7, 9, 10 అంగుళాల స్ర్కీన్ వేరియంట్‌లలో ఈ టాబ్లెట్‌లు లభ్యం కానున్నాయి. మరో ‘ల్యాప్లెట్’ సిరీస్‌లో భాగంగా టాబ్లెట్‌తో పాటు పోర్టబుల్ ఆటాచబుల్

కీబోర్డ్‌ను పొందవచ్చు.

కీలక ఫీచర్లు:

ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

3డి గేమింగ్,

హైడెఫినిషన్ వీడియో,

కైనెటిక్ స్ర్కోలింగ్ టచ్ ప్యాడ్,

5 పాయింట్ మల్టీటచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్).

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot