6,000లకే అదిరిపోయే టాబ్లెట్!

పూణే ఆధారిత టెక్ సంస్థ బియాండ్ టెక్ ‘మై-బుక్ ఎమ్ఐ3’పేరుతో సరికొత్త టాబ్లెట్ పీసీని ఆవిష్కరించింది. ప్రముఖ ఆన్ లైన్ రిటైలర్ ఫ్లిప్ కార్ట్ ఈ పీసీని రూ.6,090కి ఆఫర్ చేస్తోంది.
ఫీచర్లు:
7 అంగుళాల కెపాసిటివ్ మల్టీ టచ్ డిస్ ప్లే (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.0 ఐస్ క్రీమ్ శాండ్ విచ్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెడ్జ్ కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్, 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3డి ఫీచర్ (ఉచిత 3డి గూగుల్స్), 8జీబి ఇంటర్నల్ మెమెరీ, 1జీబి ర్యామ్, 3200ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 3జీ కనెక్టువిటీ వయా డాంగిల్, వై-ఫై, యూఎస్బీ 2.0, హైడెఫినిషన్ టీవీలకు జత చేసుకునే విధంగా హెచ్ డిఎమ్ఐ అవుట్, సంవత్సరం వారంటీ. (అదనపు ఫీచర్లు: ఆండ్రాయిడ్ మార్కెట్ అప్లికేషన్, అప్లికేషన్ ఆన్, 3డి గేమ్స్, ఫేస్ బుక్, ట్విట్టర్, మల్టీపుల్ లాంగ్వేజస్ సపోర్ట్, 3డి గేమ్స్, ఫేస్ బుక్, ట్విట్టర్, ఈరీడర్, 3డి వీడియో).
నచ్చిన ఫోన్.. నచ్చిన రేటుకు!
తాము కొనుగోలు చేసిన మొబైల్ లేదా స్మార్ట్‌ఫోన్ మరింత మన్నికతో విశ్వసనీయమైన పనితీరును కనబర్చేదిగా ఉండాలని ప్రతి ఒక్కరు ఆశిస్తారు. మొబైల్ కొనుగోలు చేయటానికి డబ్బులుంటే చాలనుకుంటే పొరపాటు. ఉత్తమ మొబైల్ ఎంపిక విషయంలో అవగాహనతో పాటు తులనాత్మక అంచనా తప్పనిసరి. మీరు ఎంపిక చేసుకున్న డివైజ్‌ను అన్ని అంశాల్లో వేరే డివైజ్‌లతో అంచనా వేసి ఓ సమగ్ర మైన అవగాహనకు రావాల్సి ఉంటుంది. ఈ విషయంలో మీకు సహాయపడేందుకు ఆన్‌లైన్ ప్రైస్ కంపారిజన్ ఇంజన్ గోప్రోబో డాట్ కామ్ (goProbo.com) మీ ముందుకొచ్చింది. ఈ సైట్ ద్వారా మీకు నచ్చిన మొబైల్ లేదా స్మార్ట్‌ఫోన్ పట్ల నిశితమైన అవగాహనకు వచ్చి నచ్చిన ధరల్లో సొంతం చేసుకోవచ్చు. కొనుగోలుదారుకు.. ఆన్‌లైన్ రిటైలర్‌కు మధ్య వారధిగా వ్యవహరిస్తున్న గోప్రోబ్ డాట్ కామ్ విశ్వసనీయ సమాచారాన్ని మాత్రమే పొందుపరుస్తుంది. ఈ సైట్‌లోకి ప్రవేశించిన వినియోగదారు అన్ని జాతీయ అంతర్జాతీయ బ్రాండ్‌లకు సంబంధించిన మొబైల్ ఇంకా స్మార్ట్‌ఫోన్‌లను స్పెసిఫికేషన్‌లతో సహా తెలుసుకోవచ్చు. ఆయా డివైజ్‌ల పై ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్లు అందిస్తున్న ధర రాయితీలను సైతం వినియోగదారు తెలుసుకోవచ్చు.


Click it and Unblock the Notifications








