కఠినమైన వాతావరణాలను తట్టుకునే కాసియో కంప్యూటర్లు!

Posted By: Prashanth

కఠినమైన వాతావరణాలను తట్టుకునే కాసియో కంప్యూటర్లు!

 

పటిష్టమైన కెమెరాలతో పాటు డిజిటల్ వాచ్‌లు, కాలిక్యులేటర్లను డిజైన్ చెయ్యటంలో సుప్రసిద్ధ కంపెనీగా గుర్తింపుతెచ్చుకున్న కాసియో (Casio) టాబ్లెట్ కంప్యూటర్‌ల మార్కెట్లోకి ప్రవేశించనుంది. కాసియో V-T500-GE, VT-500-E మోడళ్లలో రూపుదిద్దుకుంటున్న ఈ సమర్థవంతమైన కంప్యూటింగ్ గ్యాడ్జెట్‌లు 3 అడుగుల ఎత్తు నుంచి కిందపడినా చెక్కుచెదరవు. చమ్మ, ధూళి వంటి ప్రతికూల వాతవరణాలను ధీటుగా ఎదుర్కొని ఈ గ్యాడ్జెట్ మనుగడ సాగించగలదు. 10 అంగుళాల స్ర్కీన్ వేరియంట్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ పీసీలు స్క్రాచ్‌ప్రూఫ్ డిస్‌ప్లేలను కలిగి ఉంటాయి. ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అయ్యే ఈ టాబ్లెట్ లలో 1.5గిగాహెట్జ్ క్లాక్ వేగాన్ని కలిగిన శక్తివంతమైన డ్యూయల్ కోర్ టీఐ OMAP4460 ప్రాసెసర్‌లను వినియోగించారు. వీటి ధర ఇతర ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరోవైపు, ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుండై(Hyundai) మూడు సరికొత్త ఆండ్రాయిడ్ ఐసీఎస్ టాబ్లెట్ పీసీలను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ సంస్థ డిజైన్ చేసిన మూడు ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ టాబ్లెట్ కంప్యూటర్లు రష్యన్ మార్కెట్లో విడుదల కానున్నాయి. హెచ్‌టి- 7బి, హెచ్‌‌టి – 9బి, హెచ్‌టి- 10బి పేర్లతో మూడు భిన్నమైన స్ర్కీన్ వేరియంట్‌లలో విడుదల కాబోతున్న ఈ కంప్యూటింగ్ గ్యాడ్జెట్‌లు కట్టింగ్ ఎడ్జ్ స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంటాయి. రష్యన్ మార్కట్లో ఈ ఏడాది 2లక్షల యూనిట్‌లను విక్రయించేందుకు హ్యుండై కసరత్తులు చేస్తుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot