సెల్‌కాన్ 3జీ సిమ్ హైడెఫినిషన్ ట్యాబ్లెట్ ఆవిష్కరణ

Posted By:

ప్రముఖ దేశీయ మొబైల్ తయారీ సంస్థ సెల్‌కాన్ ‘సీటీ910+హెచ్‌డి' పేరుతో సరికొత్త 3జీ సిమ్ హైడెఫినిషన్ ట్యాబ్లెట్ కంప్యూటర్‌ను ప్రకటించింది. ఇండియన్ మార్కెట్లో ఈ ట్యాబ్లెట్ విలువ

రూ.7,999.

 సెల్‌కాన్ 3జీ సిమ్ హైడెఫినిషన్ ట్యాబ్లెట్ ఆవిష్కరణ

ప్రధాన ఫీచర్లు: ఆండ్రాయిడ్ 4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, హైడెఫినిషన్ డిస్‌ప్లే, 2 మెగా పిక్సల్ రేర్ ఇంకా వీజీఏ ఫ్రంట్ కెమెరా వ్యవస్థ, 3జీ, వై-ఫై, బ్లూటూత్ ఇంకా జీపీఎస్ కనెక్టువిటీ, శక్తివంతమైన 3500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 7 అంగుళాల డిస్‌ప్లే, 1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత.

వాయిస్ కాలింగ్ ఇంకా 3జీ కనెక్టువిటీ కొరకు ట్యాబ్‌లో ప్రత్యేకమైన సిమ్ స్లాట్‌ను ఏర్పాటు చేయటం జరిగింది. ప్రయాణ సందర్భాల్లో సౌకర్యవంతైన కాలింగ్‌ను నిర్వహించుకునేందకు ప్రత్యేమైన ఇయర్ పీస్‌ను సెల్‌కాన్ అందిస్తోంది. ట్యాబ్ ద్వారా వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు వీజీఏ ఫ్రంట్ కెమెరా వ్యవస్థ తోడ్పడుతుంది. ట్యాబ్‌లో పొందుపరిచిన బ్లూటూత్, వై-ఫై ఇంకా జీపీఎస్ కనెక్టువిటీ వ్యవస్థలు మన్నికైన పనితీరును కనబరుస్తాయి. బ్యాటరీ ఉత్తమ బ్యాకప్ వ్యవస్థను కలిగి ఉంటుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot