మార్కెట్లోకి సెల్‌కాన్ టాబ్లెట్

Posted By:

Celkon launches Ee-Tab (CT-1) Tablet

హైదరాబాద్: మొబైల్ ఫోన్ల విక్రయసంస్థ సెల్‌కాన్ దేశీయ మార్కెట్లోకి ‘ఈ ట్యాబ్ సీటీ-1’ పేరుతో తన మొట్టమొదటి ట్యాబ్లెట్ పీసీని విడుదల చేసింది. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఈ ట్యాబ్లెట్‌ను శనివారమిక్కడ ఆవిష్కరించారు. 7 అంగుళాల స్క్రీన్‌తో 5 పాయింట్ కెపాసిటివ్ మల్టీ టచ్ స్క్రీన్, ఆండ్రాయిడ్ 4.0.3 ఆపరేటింగ్ సిస్టమ్, 1.2 గిగాహెడ్జ్ ప్రాసెసర్‌తో దీనిని రూపొందించామని ఈ సందర్భంగా సెల్‌కాన్ ఎండీ వై.గురు తెలిపారు. 3జీ డాంగిల్‌ను ఇది సపోర్ట్ చేస్తుందని, వైఫై, 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 4జీబీ ఇన్ బిల్ట్ మెమరీ, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ, 2 మెగాపిక్సెల్ కెమెరా, ముందువైపు వీజీఏ కెమెరా వంటివి దీని ప్రత్యేకతలని వివరించారు. హెచ్‌డీఎంఐ సపోర్ట్ చేస్తుందని చెప్పారు. దేశీయ ట్యాబ్లెట్ పీసీలతో పోలిస్తే అత్యాధునిక ఫీచర్లతో రూ.6,450కే అందుబాటులో ఉంచామన్నారు.

మై ట్యూటర్‌తో: ఐసీట్, క్యాట్‌కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు ‘మాక్’ టెస్టులు నిర్వహించుకునేందుకు ‘మై ట్యూటర్’ అనే అప్లికేషన్‌ను ట్యాబ్లెట్‌లో పొందుపరిచారు. ఇంటర్‌నెట్ అవసరం లేకుండా ఆఫ్‌లైన్‌లో సైతం ఇది పనిచేస్తుంది. ప్రతీ టెస్ట్‌లోనూ కొత్త ప్రశ్నలుంటాయి. వివిధ అంశాల్లో విద్యార్థులు తమ పరిజ్ఞానాన్ని పరీక్షించుకుని, ప్రతిభను మెరుగుపర్చుకునేందుకు ట్యాబ్లెట్ ఎంతగానో దోహదం చేస్తుందని కంపెనీ ఈడీ రేతినేని మురళి తెలిపారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot