సెల్‌కాన్ నుంచి సరికొత్త టాబ్లెట్ కంప్యూటర్ (ఫోన్‌కాల్స్ కూడా చేసుకోవచ్చు)!

Posted By: Staff

సెల్‌కాన్ నుంచి సరికొత్త టాబ్లెట్ కంప్యూటర్ (ఫోన్‌కాల్స్ కూడా చేసుకోవచ్చు)!

 

హైదరాబాద్: మొబైల్ ఫోన్‌ల నిర్మాణ రంగంలో సంచలనాలు సృష్టిస్తున్న సెల్‌కాన్ మొబైల్స్ ‘సెల్‌ట్యాబ్’ పేరుతో సరికొత్త టాబ్లెట్ కంప్యూటర్‌ను బుధవారం ఆవిష్కరించింది. 7 అంగుళాల టచ్‌స్ర్కీన్ సామర్ధ్యాన్ని కలిగి ఉన్న ఈ డివైజ్ మొబైలింగ్‌కు సైతం సహకరిస్తుంది. ఇందుకుగాను ప్రత్యేక సిమ్ స్లాట్‌ను పరికరంలో ఏర్పాటు చేశారు. ఈ ట్యాబ్ మరో మూడు రోజుల్లో దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానుందని సెల్‌కాన్ సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వై.గురు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు.

సెల్‌ట్యాబ్ ఫీచర్ల విషయానికొస్తే....

7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (5 పాయింట్ మల్టీ‌టచ్),

ఆండ్రాయిడ్ 4.0.3 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

1గిగాహెడ్జ్ ప్రాసెసర్,

512ఎంబీ ర్యామ్,

4జీబి ఇన్‌బుల్ట్ మెమెరీ,

32జీబి ఎక్స్‌పాండబుల్ మెమెరీ,

ఫ్రంట్ కెమెరా,

వై-ఫై,

బ్లూటూత్,

3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

లైవ్ టీవీ అప్లికేషన్,

ధర రూ.7,499.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot