సెల్‌‌ఫోన్స్ క్యాన్సర్... నివారణా చిట్కాలు!

|

లక్షలాది మంది మొబైల్ యూజర్లను వేధిస్తున్న సమస్య ‘రేడియేషన్', కమ్యూనికేషన్ వ్యవస్థ అనివార్యమైన నేపధ్యంలో మొబైల్ ఫోన్ ప్రతి ఒక్కరి జీవితంలో భాగమై పోయింది. ఈసమస్యను పరిష్కరించే క్రమంలో బ్టూటూత్ హెడ్‌సెట్లు ఆవిర్భవించినప్పటికి పరిష్కారం ఓ కొలిక్కి రాలేదు. వైర్లతో పనిచేసే హెడ్‌సెట్‌లు రేడియేషన్ నిర్మూలనకు దోహదపడుతున్నప్పటికిప్రస్తుత తరానికి పొసగటం లేదు. ఈ నేపధ్యంలో రెట్రో రకం హెడ్‌సెట్లు తెరపైకి వస్తున్నాయి. వీటిని వినియోగించటం ద్వారా రేడియేషన్ నుంచి 98% వరకు విముక్తి పొందవచ్చు.

సెల్‌‌ఫోన్స్ క్యాన్సర్... నివారణా చిట్కాలు!

సెల్‌ఫోన్‌ను.. డీడీటీ పురుగుమందు, వాహనాల నుంచి వెలువడే పెట్రోలు పొగ వంటి క్యాన్సర్‌ కారకాల (2బీ) విభాగంలో చేర్చింది. ''సెల్‌ఫోన్లతో ఎంతోకొంత ముప్పు పొంచి ఉన్నట్టు తేలింది. కాబట్టి క్యాన్సర్లు, సెల్‌ఫోన్లకు గల సంబంధంపై నిశితంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది'' అని ఏఐఆర్‌సీ అధ్యక్షుడు జోనాథన్‌ సామెట్‌ అభిప్రాయపడ్డారు. సెల్‌ఫోన్లతో క్యాన్సర్‌ ముప్పు పొంచి ఉండొచ్చని మాత్రమే వెల్లడైంది గానీ.. అదింకా నిర్ధారణ కాలేదన్న విషయాన్ని గుర్తించాలనీ ఏఐఆర్‌సీ పేర్కొంది. అంతేకాకుండా మొబైల్ ఫోన్స్ వాడుతున్నటువంటి వారు ఈ క్రింది సూచనలు పాటిస్తే కొంత వరకు కాన్సర్ బారిన పడకుండా ఉండవచ్చునని వారు సూచించారు.

ఫోన్ నెట్‌వర్క్ తక్కువ సిగ్నల్‌ను కలిగి ఉన్నప్పుడు అత్యధికంగా రేడియేషన్‌ ఉత్పత్తి అవుతుంది. కాబట్టి, మీ మొబైల్ నెట్‌వర్క్ తక్కువ సిగ్నల్‌లో ఉన్నప్పుడు మాట్లాడటం మానుకోండి.

సెల్‌ఫోన్‌లను చెవి దగ్గర పెట్టకుని గంటల తరబడి మాట్లాడకండి. హెడ్‌సెట్‌ వాడడం రేడియేషన్‌ ప్రభావం నుంచి మెదడును రక్షించుకోవటానికి ఇది చాలా తేలికైన మార్గం. ఇది ఫోన్‌ యాంటెనా నుంచి తల దూరంగా ఉండేలా చేస్తుంది. బ్లూటూత్‌ కూడా కొంతమేరకు ఉపయోగపడుతుంది.

మెసేజ్‌లు పంపడం వీలైనప్పుడల్లా లిఖిత సందేశాలు పంపటమూ మంచిదే. ఈ సమయంలో సెల్‌ఫోన్‌ మెదడుకు దూరంగా ఉంటుంది కాబట్టి ఎలాంటి రేడియేషన్‌ ప్రభావమూ దానిపై పడదు.

అలారం గడియారంలా వద్దు మాట్లాడుతున్నప్పుడే కాదు. పక్కన పడేసినప్పుడూ సెల్‌ఫోన్‌ నుంచి రేడియేషన్‌ వెలువడుతుంది. అందుకే దీన్ని తల పక్కనే పెట్టుకొని అలారం గడియారంలా వాడకపోవటమే మంచిది. దీంతో సెల్‌ఫోన్‌ విద్యుదస్కాంత క్షేత్ర ప్రభావం నుంచి మెదడును కాపాడుకోవచ్చు.

జేబులో మొబైల్ పెట్టుకోవద్దు సెల్‌ఫోన్‌ని ప్యాంటు జేబులో పెట్టుకున్నా, బెల్ట్‌కు ధరించినా సంతాన సామర్థ్యంపై ప్రభావం చూపుతుందని కొందరు వైద్యుల అభిప్రాయం.

ఇది ఆడవారిలో రొమ్ము క్యాన్సర్‌ ప్రమాదాన్నీ తెచ్చిపెట్టొచ్చనీ వివరిస్తున్నారు. కాబట్టి వీలైనప్పుడల్లా సెల్‌ఫోన్‌ని దూరంగా ఉంచటం మేలు. బయటకు వెళ్లినపుడు ప్యాంటు, చొక్కా జేబుల్లో కన్నా సంచీలో వేసుకోవటం మంచిది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X