ఏప్రిల్ ఫూల్ కాదు.. పచ్చి నిజం!!

Posted By: Prashanth

ఏప్రిల్ ఫూల్ కాదు.. పచ్చి నిజం!!

 

ఏప్రిల్ ఫూల్ అనుకుని సరదాగా నవ్వుకుని కొట్టిపారేసిన వార్త అక్షర సత్యమై టెక్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. కొత్త ఆలోచనలకు ప్రాధాన్యమిచ్చే ఇసిర్ (Eser) సంస్థ, తక్కువ కంప్యూటింగ్ వినియోగించే వారి కోసం తక్కువ స్థాయి బడ్జెట్‌లో కూల్ టాబ్లెట్ కంప్యూటర్‌ను తయారుచేసింది. తమ వినూత్న ఆలోచనకు మిశ్రమ స్పందన లభిస్తుందనే ధీమాను ఈ బ్రాండ్ వ్యక్తం చేస్తోంది. ‘ఇసిర్ ఏ10’గా డిజైన్ కాబడిన ఈ ఆండ్రాయిడ్ ఆధారిత డివైజ్ ధర అంచనా రూ.3,000. ఇతర ఫీచర్లను పరిశీలిస్తే:

7 అంగుళాల టచ్‌స్ర్కీన్(రిసల్యూషన్ 800×480 పిక్సల్స్),

ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

ఆండ్రాయిడ్ 2.3 ఆపరేటింగ్ సిస్టం,

1.2జిగాహెడ్జ్ సామర్థ్యం గల బాక్స్‌చిప్ ప్రాసెసింగ్ యూనిట్,

4జీ ఇంటర్నల్ మెమరీ,

మైక్రోఎస్డీ కార్ట్‌స్లాట్ ద్వారా మెమరీని పెంచుకునే సౌలభ్యత,

వై-ఫై కనెక్టువిటీ,

హెచ్‌డిఎమ్ఐ అవుట్,

3జీ కనెక్టువిటీ కోసం యూఎస్బీ డాంగిల్.

పీసీలో అమర్చిన వెడల్పాటి 7 అంగుళాల స్ర్కీన్ ద్వారా హై క్వాలిటీ వీడియోలను ఉత్తమ క్వాలిటీ రిసల్యూషన్‌తో వీక్షించవచ్చు. అంతేకాకుండా మన్నికైన వెబ్‌బ్రౌజింగ్ నిర్వహించుకోవచ్చు. టచ్‌స్ర్కీన్ వ్యవస్థ సున్నితంగా స్పందిస్తుంది. ఈ కూల్ గ్యాడ్జెట్ హై స్పీడ్ మల్టీ టాస్కింగ్ సామర్ధ్యాన్ని కలిగి ఉంది. డివైజ్ ముందు భాగంలో అమర్చిన ఫ్రంట్ కెమెరా ద్వారా శ్రోత అంతరాయం లేని వీడియో కాలింగ్ నిర్వహించుకోవచ్చు. అంతేకాదు వీడియోలను క్వాలిటీతో రికార్డ్ చేసుకోవచ్చు. పొందుపరిచిన ఆడియో, వీడియో ప్లేయర్ వ్యవస్థ మన్నికతో కూడిన వినోదాన్ని చేరవచేస్తుంది. లోడ్ చేసిన ఆండ్రాయిడ్ 2.3 ఆపరేటింగ్ సిస్టం యూజర్ ఫ్రెండ్లీ కంప్యూటింగ్‌కు సహకరిస్తుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot