46 అంగుళాల కంప్యూటింగ్ ట్యాబ్లెట్!

Posted By:

46 అంగుళాల కంప్యూటింగ్ ట్యాబ్లెట్!

మ్యూజియమ్స్ ఇంకా ఇతర కార్పొరేట్ అవసరాల నిమిత్తం పెద్ద శ్రేణి మల్టీ టచ్ డివైస్‌లను సమకూర్చే ప్రముఖ అంతర్జాతీయ కంపెనీ ఐడియమ్ (Ideum) సరికొత్త కంప్యూటింగ్ ట్యాబ్లెట్‌కు రూపకల్పన చేసింది. కాఫీ టేబుల్ సైజులో ఉండే ఈ 46 అంగుళాల ఆండ్రాయిడ్ కంప్యూటింగ్ ట్యాబ్లెట్‌లను ప్రత్యేకించి లివింగ్ రూమ్స్ కోసం కంపెనీ డిజైన్ చేసింది. పెద్ద తెరను కలిగి ఉండే ఈ డివైస్‌ల ద్వారా అత్యుత్తమ బ్రౌజింగ్ ఇంకా గేమింగ్ అనుభూతులను అస్వాదించవచ్చు.

ఈ కాఫీ టేబుల్ ట్యాబ్లెట్స్ పై విండోస్ ఇంకా ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లను యాక్సిస్ చేసుకునేందుకు వీలుగా విండోస్ 7, విండోస్ 8 ఇంకా ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టంలను బూట్ చేసుకునే సదుపాయాన్ని కంపెనీ కల్పిస్తోంది. యూఎస్ ఇంకా కెనాడా ప్రాంతాల్లో ఈ డివైస్‌లను అద్దెకిచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot