మనుషులను మోసుకెళ్లే సూట్‌కేస్

Posted By:

ప్రయాణాల సమయంలో ఇక పై మీరు లగేజీని మోసుకువెళ్లాల్సిన అవసరం ఉండదు. అదే మిమ్మల్సి తీసుకువెళ్లే పరిస్థితులు రాబోతున్నాయి. చైనాకు చెందిన హె లియాంగ్సాయ్ అనే ఔత్సాహిక శాస్త్రవేత్త ఓ వినూత్న సూట్‌కేస్‌కు రూపకల్పన చేసారు. ఈ సూట్‌కేస్‌ను అవసరమైనపుడు స్కూటర్‌లా మార్చుకోవచ్చు. ఇందుకుగాను ప్రత్యేకమైన మోటార్ వ్యవస్థను సూట్‌కేస్‌లో ఏర్పాటు చేసారు.
 

మనుషులను మోసుకెళ్లే సూట్‌కేస్

ఈ సూట్‌కేస్ స్కూటర్ బరువు 7 కేజీలు. ఇద్దరు మనుషునులు మోసుకెళ్లగలదు. అవసరం లేనపుడు స్కూటర్ హ్యాండీల్‌ను సూట్‌కేస్‌లోనికి నెట్టేయవచ్చు. ఈ స్కూటర్‌ను నియంత్రించేందుక ప్రత్యేకమైన బ్రేక్వ్యవస్థతో పాటు లైట్‌లను అమర్చారు. గంటకు 20 కిలో మీటర్ల వేగంతో ఈ స్కూటర్ ప్రయాణిస్తుంది. ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన బ్యాటరీ స్కూటర్‌కు ఇంధన శక్తిని సమకూరుస్తుంది. బ్యటరీని పూర్తిగా ఛార్జ్ చేసినట్లయితే ఈ సూట్‌కేస్ స్కూటర్ పై 50 నుంచి 60 కిలో మీటర్ల వరకు ప్రయాణించవచ్చు. జీపీఎస్ నేవిగేషన్, తెఫ్ట్ అలారమ్ వంటి ప్రత్యేక ఫీచర్లను ఈ సూట్‌కేస్ స్కూటర్‌లో నిక్షిప్తం చేసారు.

వాస్తవానికి హె లియాంగ్సాయ్ ఓ రైతు.. ఈ సూట్‌కేస్ స్కూటర్‌ను తయారు చేసేందుకు ఆయనకు 10 సంవత్సరాల కాలం పట్టింది. గతంలో కారు భద్రత పై లియాంగ్సాయ్ రూపొందించిన ఓ వ్యవస్థకు అమెరికా ఓ అవార్డును ప్రకటించింది. అయితే ఆ అవార్డను అందుకోవటానికి వెళ్లిన లియాంగ్సాయ్ తన లగేజీని మర్చిపోయారు. ఆ సమయంలో ఆయనకు సూట్‌కేస్ స్కూటర్ తయారు చేయాలన్న ఆలోచన వచ్చింది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting