Home
Computer

అమెజాన్‌లో బంపరాఫర్.. రూ.35,000 ల్యాప్‌టాప్‌ ఇప్పుడు రూ.16,000కే.. 256GB SSD + 14.1 FHD డిస్‌ప్లే!

Chuwi HeroBook Pro: ఒకప్పుడు ల్యాప్‌టాప్ కొనాలంటే కనీసం రూ. 50,000 అయినా పెట్టాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ప్రీమియం ఫీచర్లు ఉన్న ల్యాప్‌టాప్స్‌ కూడా చాలా తక్కువ ధరకే లభిస్తున్నాయి. డిస్కౌంట్ల ఆఫర్ల పుణ్యమా అని ఇవి తక్కువ ధరకే అందుబాటులోకి వస్తున్నాయి. అలాంటి ఒక మంచి ఆఫర్ ప్రస్తుతం అమెజాన్‌లో ఉంది. "చువీ హీరోబుక్ ప్రో" ల్యాప్‌టాప్‌పై ఏకంగా 54% డిస్కౌంట్ ఇస్తున్నారు.

దీని అసలు ధర రూ.34,990, కానీ ఇప్పుడు కేవలం రూ.15,990కే సొంతం చేసుకోవచ్చు. కొన్ని బ్యాంక్ కార్డులు వాడితే అదనంగా రూ.1,000 వరకు డిస్కౌంట్ వస్తుంది. అంటే ల్యాప్‌టాప్ ధర అక్షరాలా రూ.15,000కే పడిపోతుంది. అంతే కాదు, మీ పాత ల్యాప్‌టాప్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే మరో రూ.5,600 వరకు తగ్గింపు పొందొచ్చు.

Chuwi HeroBook Pro 14 1 Budget-Friendly Premium Laptop Available on Amazon for Rs 16990

* మెరుగైన పర్ఫార్మెన్స్, స్పీడ్..

చువీ హీరోబుక్ ప్రో ల్యాప్‌టాప్‌లో ఇంటెల్ సెలెరాన్ N4020 ప్రాసెసర్ ఉంది. ఇది 1.1GHz నుంచి 2.8GHz వరకు వేగంగా పనిచేస్తుంది. రోజువారీ పనులు, బ్రౌజింగ్, స్టడీస్.. ఇలాంటి పనులకు ఇది చాలా బాగా పనిచేస్తుంది. 8GB RAM ఉండటంతో మల్టీ టాస్కింగ్ కూడా స్మూత్‌గా ఉంటుంది.

స్టోరేజ్ విషయానికొస్తే, 256GB SSD ఉంది. ఇది రెగ్యులర్ హార్డ్ డ్రైవ్‌ల కంటే చాలా ఫాస్ట్‌గా పనిచేస్తుంది. మీకు ఇంకా ఎక్కువ స్టోరేజ్ కావాలంటే, M.2 SSD స్లాట్ ద్వారా 1TB వరకు పెంచుకోవచ్చు లేదా 128GB TF కార్డ్ కూడా వేసుకోవచ్చు. అయితే అది ల్యాప్‌టాప్‌తో రాదు, విడిగా కొనాలి.

* మంచి డిస్‌ప్లే, స్టైలిష్ డిజైన్..

ఈ ల్యాప్‌టాప్‌లో 14.1-అంగుళాల ఫుల్ HD IPS స్క్రీన్ ఉంది. 1920×1080 రిజల్యూషన్‌తో పిక్చర్స్ చాలా స్పష్టంగా, కలర్‌ఫుల్‌గా కనిపిస్తాయి. యాంటీ-గ్లేర్ స్క్రీన్ ఉండటం వల్ల కళ్లు కూడా స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటాయి. 16:9 యాస్పెక్ట్ రేషియో ఉండడంతో వీడియోలు చూసేటప్పుడు వైడ్ వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్ వస్తుంది.

పెద్ద స్క్రీన్ ఉన్నా, ఈ ల్యాప్‌టాప్ చాలా సన్నగా, కేవలం 1.3kg బరువు మాత్రమే ఉంటుంది. చేతిలో ఇట్టే పట్టేస్తుంది. మందం కూడా జస్ట్ 0.83 అంగుళాలే. ఇంత సన్నగా బరువు తక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని ఎక్కడికంటే అక్కడికి ఈజీగా తీసుకెళ్లొచ్చు. స్టూడెంట్స్, ప్రొఫెషనల్స్, ట్రావెల్ చేసేవాళ్లు.. ఎవరికైనా ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.

* బ్యాటరీ లైఫ్ అదిరింది

ఈ ల్యాప్‌టాప్‌లో 38Wh లిథియం-అయాన్ బ్యాటరీ ఉంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 9 గంటల వరకు పనిచేస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఉండటంతో త్వరగా ఛార్జ్ కూడా అవుతుంది. డ్యూయల్-బ్యాండ్ వైఫై (2.4G/5G) సపోర్ట్ చేస్తుంది, 867Mbps వరకు స్పీడ్ ఉంటుంది. బ్లూటూత్ 4.2 కూడా ఉంది.

కనెక్షన్స్‌ విషయానికి వస్తే ఈ బడ్జెట్ ల్యాప్‌టాప్‌లో USB 3.0 పోర్ట్‌లు, మినీ HDMI పోర్ట్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, మైక్రోఫోన్, నాలుగు బిల్ట్-ఇన్ స్పీకర్లు కూడా ఉన్నాయి. వీడియో కాల్స్ కోసం వెబ్‌క్యామ్ కూడా ఇచ్చారు. మల్టీమీడియా ఎక్స్‌పీరియన్స్ చాలా బాగుంటుంది.

* పనికీ, చదువుకీ పర్ఫెక్ట్ పార్టనర్..

ఈ విండోస్ 11 ల్యాప్‌టాప్‌లో ఫుల్-సైజ్ కీబోర్డ్, పెద్ద ట్రాక్‌ప్యాడ్ ఉన్నాయి. టైపింగ్, నావిగేషన్ చాలా ఈజీగా ఉంటాయి. చూడటానికి స్టైలిష్‌గా ఉంటుంది, పర్ఫార్మెన్స్ కూడా సంతృప్తికరంగా ఉంటుంది, కావాల్సిన ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. చువీ హీరోబుక్ ప్రో ఈ ధరకు నిజంగా బెస్ట్ డీల్.

ఈ లిమిటెడ్ టైమ్ అమెజాన్ ఆఫర్ ఎప్పుడైనా అయిపోవచ్చు. తక్కువ ధరలో మంచి ల్యాప్‌టాప్ కోసం చూస్తుంటే, ఇప్పుడే వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి.

More from GizBot

Best Mobiles in India

English summary
Unbelievable Amazon deal on Chuwi HeroBook Pro. Get 8GB RAM, SSD, and Full HD screen for just Rs 16K. A perfect budget laptop for students and professionals needing performance and portability.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X