మీరు వ్యాపారావేత్తా, దించుకోండి మీ తలభారం ‘సిస్కో సియస్’తో!!

Posted By: Super

మీరు వ్యాపారావేత్తా, దించుకోండి మీ తలభారం ‘సిస్కో సియస్’తో!!

వ్యాపార లావాదేవీలతో పాటు వ్యాపార అవసరాలకు దోహదపడే విధంగా ప్రముఖ నెట్ వర్కింగ్ సరఫరాదారు ‘సిస్కో సియస్’ రూపొందించిన సరికొత్త టాబ్లెట్ పీసీ మార్కెట్లో హిట్ కొడుతుందా..?, అవుననే అంటున్నాయి విశ్లేషక వర్గాలు, దేశంలో ఐపీ టెలీఫోనీ సర్వీస్ వ్యవస్థను పంపిణి చేయ్యటంలో కీలక పాత్ర పోషిస్తున్న ‘సిస్కో’ 7 లక్షల వినియోగదారుల విశ్వసనీయతను చొరగుంది.

వ్యాపారావేత్తల కోసం డిజైన్ చేయబడిన ఈ టాబ్లెట్ పరికరంలో ‘బిజినెస్’ సంబంధిత ఆప్లికేషన్లను పొందుపరిచినట్లు సిస్కో ఇండియా సేల్స్ మేనేజర్ ‘మిన్ హాజ్ జియా’ తెలిపారు. టాబ్లెట్ పీసీలోని డేటా సెక్యూరిటీకి సంబంధించి పటిష్ట వ్యవస్థను రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు. నిత్యం వ్యాపార ఒత్తిడితో సతమతమయ్యే వ్యాపారస్థులకు లావాదేవీలను చక్కదిద్దటంతో పాటు డేటాను గోప్యంగా ఉంచంటలో ‘సిస్కో’ టాబ్లెట్ నమ్మకంగా వ్యవహరిస్తుందని జియో ధీమా వ్యక్తం చేశారు.

- 7 అంగుళాల టచ్‌స్క్రీన్ సామర్ధ్యంతో రూపుదిద్దుకున్న ఈ టాబ్లెట్ పీసీ డిస్‌ప్లే, నాణ్యమైన క్లారిటీతో విజువల్స్‌ను చూపిస్తుంది.

- ఇంటెల్ ఆటమ్ ప్రొసెసర్‌తో పాటు 1జీబీ ర్యామ్‌లు సమర్థవంతమైన పనితీరును కలిగి ఉంటాయి.

- టాబ్లెట్‌లో ఏర్పాటు చేసిన రెండు కెమెరాలు ఆకట్టుకునే పనితీరును కలిగి ఉంటాయి.

- వై - ఫై, 3జీ నెట్‌వర్కింగ్ అంశాలు కమ్యూనికేషన్ వ్యవస్థను మరింత బోలపేతం చేస్తాయి.

- వెబ్ కాన్ఫిరెన్సింగ్, సిస్కో జబ్బర్ ఇన్స్‌స్టెంట్ మెసేజింగ్, టెలీ ప్రెసెన్స్, ఈ - మెయిల్, క్యాలెండర్ వంటి ఆప్లికేషన్లు వినియోగదారుడికి మరింత లబ్ధి చేకూరుస్తాయి.

- పొందుపరిచిన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ వ్యవస్థ వ్యాపారాంశాల్లో మరింత లబ్ధి చేకూరుస్తుంది.

- త్వరలో భారతీయ మార్కెట్లో విడుదలకాబోతున్న ‘సిస్కో సియస్’ టాబ్లెట్ పీసీ ధర రూ. 35,000 ఉంటుంది. టాబ్లట్ డాక్ తో కలిపి ఈ టాబ్లెట్ పీసీ ధర రూ. 50,000 ఉంటుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot