వస్తున్నాయ్... త్వరలో!!

Posted By: Super

వస్తున్నాయ్... త్వరలో!!

 

ప్రముఖ గ్లోబల్ కంపెనీ సిస్కో (Cisco) టాబ్లెట్ పీసీల వ్యాపారంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. గత అగస్ట్ లో ‘7 అంగుళాల స్క్ర్రీన్ సైజులో ఆండ్రాయిడ్ ఆధారిత టాబ్లెట్ పీసీని ప్రవేశపెట్టిన ఈ కొత్త బ్రాండ్ వచ్చే ఏడాది సరికొత్త ప్రభంజనానికి తెరలేపనుంది. ’

2012లో సిస్కో విడుదలచేయుబోతున్న మరిన్ని టాబ్లెట్ పీసీలలో ఆధునిక ఆండ్రాయిడ్ వర్షన్ ఐస్ క్రీమ్ శాండ్ విచ్ ఆపరేటంగ్ వ్యవస్థను లోడ్ చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు ఉటంకిస్తున్నాయి. అదేవిధంగా ‘అత్యాధునిక సెక్యూరిటీ వ్యవస్థ’లను ఈ గ్యాడ్జెట్లలో పొందుపరచనున్నట్లు తెలుస్తోంది.

అన్ని వర్గాలు వినియోగదారులు ముఖ్యంగా బిజినెస్ వర్గాలను మరింత ఉపకరించే విధంగా యూజర్ ఫ్రెండ్లీ మరియు ఫ్లెక్సీబుల్ ఫీచర్లను నిక్షిప్తం చేసినట్లు విశ్లేషణలు స్పష్టం చేస్తున్నాయి. ఈ టాబ్లెట్ పీసీల ధర ఇతర స్పెసిఫికేషన్ల వివరాలు తెలియాల్సి ఉంది. డిజిటెల్ ప్రపంచంలో రోజు రోజుకు చోటుచేసుకుంటున్న అనూహ్య మార్పుల నేపధ్యంలో సిస్కో కొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నట్లు తెలుస్తోంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot