బాక్సులు బద్దలుకొట్టేందుకు ‘ఇద్దరు మిత్రులు’ ఏ రేంజ్‌లో ఉన్నారు..?

Posted By: Staff

బాక్సులు బద్దలుకొట్టేందుకు ‘ఇద్దరు మిత్రులు’ ఏ రేంజ్‌లో ఉన్నారు..?

"ప్రపంచ కంప్యూటింగ్ మార్కెట్లో అలజడి మొదలైంది.. అధునాతన సాంకేతిక ప్రకంపనలు ఏ క్షణాన్నైనా తాకోచ్చన్న సంకేతాలు ఇప్పటికే స్పష్టంగా అందాయి. ఆపిల్ ఐప్యాడ్ 2, శ్యామ్‌సంగ్ గెలక్సీ ట్యాబ్ 750 టాబ్లెట్ పీసీల ఉధృతికి ఎన్ని బ్రాండ్లు చెల్లాచెదురవుతాయో వేచి చూడాలి మరి..’’

అమ్మకాల రికార్డులను కుండ బద్దలగొట్టే సత్తా కలిగిన ‘ఆపిల్’, శ్యామ్‌సంగ్ పోటీ బ్రాండ్ల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ‘ఐప్యాడ్ - 2’ పేరుతో ఆపిల్ , ‘గెలక్సీ ట్యాబ్ 750’ పేరుతో శ్యామ్‌సంగ్‌లు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన గ్యాడ్జెట్లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. అయితే ఈ గ్యాడ్జెట్లలోని తేడాలను పరిశీలిద్దాం.

ఈ డివైజుల్లోని పీచర్లను పరిశీలిస్తే ‘ఆపిల్ ఐప్యాడ్2’ 8.8mm పరిమాణం కలిగి పల్చటి డిజైన్‌తో రూపొందించారు. చూడమచ్చటగా ఆకట్టకునే ఈ ఐప్యాడ్ నలుపు, తెలుపు రెండు రంగుల్లో రూపుదిద్దుకుంది. 246.2 X 170.4 X 10.9 mm పరిమాణంతో రూపుదిద్దుకున్న ‘గెలక్సీ ట్యాబ్ 750’ కేవలం 599 గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది. బార్ డిజైన్‌లో రూపుదిద్దుకున్న ఈ టాబ్లెట్ పీసీ నలుపు రంగులో దర్శనమిస్తుంది.

ఆపిల్ i ఆపరేటింగ్ వ్యవస్థ 4.3 ఆధారితంగా రూపుదిద్దకున్న ‘ఆపిల్ ఐప్యాడ్ 2’ను ఆపిల్ A5 చిప్ సెట్ డ్యూయల్ కోర్‌తో మరింత బలోపేతం చేశారు. ఇందులో పొందుపరిచిన కమ్యూనికేషన్ వ్యవస్థలు మొబైల్ బ్రౌజింగ్ అంశాన్ని వేగవంతంగా నడిపిస్తాయి. పొందుపరిచిన ఎల్‌ఈడీ బ్యాక్ లిట్ డిస్‌ప్లే స్క్రీన్‌కు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా సంరక్షిస్తుంది. ఇక కెమెరా విషయానికి వస్తే అనుసంధానించి ఫ్రంట్, బ్యాక్ కెమెరాలు డిజిటల్ జూమ్‌ను కలిగి మెరుగైన వీడియో ఛాటింగ్‌తో పాటు ఉత్తమైన ఫోటోగ్రఫీని మీకు నేర్పిస్తాయి.

‘గెలక్సీ ట్యాబ్ 750’లో 8.1 మెగా పిక్సల్ బ్యాక్ కెమెరాతో పాటు వీడియో కాల్స్ చేసుకునేందుకు ఏర్పరిచిన ఫ్రంట్ కెమెరాలు దర్శనమిస్తాయి. అయితే శ్యామ్‌సంగ్‌లో జూమ్ వ్యవస్థ కొరవడింది. డేటా స్టోరేజి అంశాలను పరిశీలిస్తే ‘ఆపిల్ ఐప్యాడ్ 2’ 16జీబీ ఇంటర్నల్ మెమరీ సామర్థ్యం కలిగి ఉంటుంది. అయితే ఎక్సటర్నల్ స్లాట్ విధానం ద్వారా ఈ జీబీని 64కు వృద్థి చేసుకోవచ్చు. అయితే ‘గెలక్సీ 750’లో మెమరీని పెంచుకునే అవకాశాన్ని కల్పించ లేదు. కేవలం 16జీబీ ఇంటర్నెల్ మెమరీ వరకే పరిమితం.

అధునాత ఆప్లికేషన్లను ‘ఐఫ్యాడ్ 2’లో ముందుగానే లోడ్ చశారు. కనెక్టువిటీ అంశంలో ఆపిల్ డివైజ్ మరింత ముందంజలో ఉంది. 2.1 వర్షన్ బ్లూటూత్, 802.11 b/g/n వై - ఫై వ్యవస్థలు కమ్యూనికేషన్ వ్యవస్థను మరింత వేగవంతం చేస్తాయి. అయితే సాధారణ కెనుక్టువిటీ వ్యవస్థలన గెలక్సీలో పొందుపరిచారు. 16,32,64 జీబీలలో లభ్యమయ్యే ఆపిల్ ఐప్యాడ్ 2 ధరలు $499, $599, and $699గా ఉంటాయి. శ్యామ్‌సంగ్‌ గెలక్సీ విషయానికి వస్తే ఇండియన్ మార్కెట్లో ఈ టాబ్లెట్ పీసీ ధర రూ .36500 ఉంటుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot