ఐకోనియాను మించిన అసస్..!!

Posted By: Staff

ఐకోనియాను మించిన అసస్..!!

‘టాబ్లెట్ పీసీ’ల మార్కెట్లో రోజుకో కొత్త ఒరవడి పుట్టుకొస్తుంది.. మార్కెట్లోకి రయ్ మంటూ దూసుకొస్తున్న కొత్త బ్రాండ్‌లు.. టాప్‌టెన్ బ్రాండ్‌లకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ప్రస్తుత మార్కెట్లో ఏ బ్రాండ్ గొప్పదని తేల్చిచెప్పటం కష్టం.. ఒక బ్రాండుని మించినది మరోకటి ఇలా చెప్పుకుంటూ పోతే అంతే.

అయితే ఈ క్రమంలో విడుదలైన ‘ఏసర్ ఐకోనియా’, ‘అసస్ ఈ ప్యాడ్’ వంటి టాబ్లెట్లు ఒకదానిని మించి మరొకటి పోటీపడుతూ ఉండటంతో ఏ ‘మోడల్ ఛూస్’ చేసుకోవాలా తెలియక
కోనుగోలుదారు ఆయోమయానికి గురువుతున్నారు. ‘అసస్ ఈ ప్యాడ్’ అధునాతన హంగులతో టాబ్లెట్ మార్కెట్లోకి దూసుకొచ్చిని ‘హాట్ బ్రాండ్’, ఫీచర్స్ విషయంలో ఇతర టాబ్లెట్లకు ధీటుగా నిలుస్తూ, సమంజసమైన ధరలతో టాబ్లెట్ ప్రేమికులను ఆకట్టకుంటోంది.

వీటి రూపురేఖల విషయానికి వస్తే ‘అసస్ ఈ ప్యాడ్ టాబ్లెట్ ’ 10.7 అంగుళాల పొడువు, 6.7 అంగుళాల వెడల్పు, 0.5 అంగుళాల మందపు దారుడ్యం కలిగి ఉంటుంది. ఇక ఏసర్ ఐకోనియా టాబ్లెట్ విషయానికి వస్తే 10.1 అంగుళాల పొడవు, 7 అంగుళాల వెడల్పు, 0.54 మందపు దారుడ్యం కలిగి ఉంటుంది. అయితే ఈ రెండు ట్యాబ్లెట్లకు డిస్ ప్లే వైశాల్యం మాత్రం 10.1 అంగుళాలే. TFT టచ్ స్ర్కీన్ సామర్థ్యంతో పని చేసే ఈ ట్యాబ్లెట్లు 1280 x 800 resolution కలిగి ఉంటాయి.

ఆండ్రాయిడ్ హనీకాంబ్ ఆపరేటింగ్ వ్యవస్థ పై ఈ ట్యాబ్లెట్లు పనిచేస్తాయి. ఈ ట్యాబ్లెట్లలో అనుసుంధానించబడిన Nvidia Tegra 2 ప్రాసెస్సర్, 1 GB RAM వంటి అంశాలు టాబ్లెట్ పని వేగాన్ని 1 GHzకి పెంచుతాయి. మెమరీ విషయంలో ఇతర ట్యాబ్లెట్లతో పోలిస్తే అసస్ ఈ ప్యాడ్ టాబ్లెట్ మాత్రం కాస్త డిఫ్రెంట్‌గా ఉంటుంది. రెండు వేరియంట్స్‌తో కూడికుని ఉన్న ఈ టాబ్లెట్ కు ఒక వేరియంట్ లో ఇంటర్నెల్ గా 16 GB సామర్ధ్యం కలిగి ఉంటే, మరో వేరియంట్ లో 32 GB సామర్థ్యాన్ని install చేసుకునే సుదుపాయం ఉంది.

5 మెగా పిక్సల్ కెమెరా సామర్ధ్యం కలిగిన ఈ రెండు టాబ్లెట్లు మంచి ఫోటోలను అందిస్తాయి. మిత్రులతో వీడియో ఛాటింగ్, వీడియో కాన్ఫిరెన్సింగ్ నిర్వహించుకునేందుకు ఈ టాబ్లెట్ల ముందు భాగాల్లో కెమెరాలను అమర్చారు. 2 మోగా పిక్సల్ సామర్ధ్యం కలిగి ఉన్న ‘ఏసర్ ఐకోనియా టాబ్లెట్’ ఫ్రంట్ కెమెరా నాణ్యమైన అనుభూతిని కలిగిస్తుంది. ఫ్రంట్ కెమెరా విషయంలో ఏసర్ ఐకోనియాతో పోలిస్తే, అసస్ ఈ ప్యాడ్ కాస్త తక్కువ సామర్థ్యం కలిగి ఉంది. ఎందుకుంటే ఈ టాబ్లెట్ ఫ్రంట్ కెమెరా సామర్థ్యం 1.2 మోగా పిక్సల్ మాత్రమే.

ఇక బ్యాటరీ విషయంలో అసస్ ఈ ప్యాడ్ 24.4 watt-hours సామర్థ్యంతో 15 గంటల పాటు నిరంతరంగా వీడియో రికార్డు చేసుకునేందుకు సహకరిస్తుంది. అయితే ‘ఏసర్ ఐకోనియా టాబ్లెట్’ బ్యాటరీ సామర్ధ్యం మాత్రం 24.1 watt-hour కలిగి ఉంది. చివరిగా వీటి ధరల విషయానికి వద్దాం... రెండు వేరియంట్లు కలిగి ఉన్న ‘అసస్ ఈ ప్యాడ్ టాబ్లెట్ల’ ధరలు రెండు విధాలుగా నిర్ధారించారు. 16 GB storage capacity కలిగి ఉన్న ట్యాబ్లెట్ ధర రూ.18,354 కాగా, 32 GB storage capacity కలిగి ఉన్న టాబ్లెట్ ధరను రూ. 22,954కు నిర్థారించారు. ఇక ‘ఏసర్ ఐకోనియా టాబ్లెట్’ ధర విషయానికస్తే రూ.25,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot