దూకుడుగా ఒకరి పై మరొకరు!

Posted By: Prashanth

దూకుడుగా ఒకరి పై మరొకరు!

 

తక్కువ ధర టాబ్లెట్ కంప్యూటర్ల మార్కెట్ రోజు రోజుకు విస్తరిస్తున్న నేపధ్యంలో తయారీ కంపెనీల మధ్య పోటీవాతావరణం నెలకుంది. ఇటీవల లాంచ్ అయిన ఇంటెక్స్ ఐట్యాబ్, మైక్రోమ్యాక్స్ ఫన్‌బుక్ టాబ్లెట్ పీసీలు వాడివేడిగా పోటీ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. క్లుప్తంగా వీటి స్పెసిఫికేషన్‌లు...

ఇంటెక్స్ ఐట్యాబ్:

8 అంగుళాల టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 800 x 600పిక్సల్స్),

ఆండ్రాయిడ్ జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

1గిగాహెడ్జ్ ప్రాసెసర్,

3డి ప్రాసెసింగ్ యూనిట్,

640 x 480పిక్సల్ సామర్ధ్యం గల ఫ్రంట్ కెమెరా,

వీడియో రికార్డింగ్,

3జీ కనెక్టువిటీ,

బ్లూటూత్,

యూఎస్బీ కనెక్టువిటీ,

బ్రౌజర్ (ఆడోబ్ ఫ్లాష్ ప్లేయర్ 11),

నెట్‌వర్క్ సపోర్ట్ (2జీ,3జీ),

ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, గేమ్స్ర్,

5000ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

టాక్‌టైమ్ 5 నుంచి 6 గంటలు.

ధర అంచనా రూ.12,000.

మైక్రోమ్యాక్స్ ఫన్‌బుక్:

7 అంగుళాల మల్టీ టచ్‌స్ర్కీన్, బరువు 350 గ్రాములు, ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, 1.2 గిగాహెడ్జ్ ప్రాసెసర్, మాలీ 400 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, హై డెఫినిషన్ వీడియో రికార్డింగ్, 512ఎంబీ డీడీఆర్3 ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, 512 ఎంబీ డీడీఆర్3 ర్యామ్, బాహ్య మెమరీ 32జీబి, వై-ఫై, 3జీ, యూఎస్బీ కనెక్టువిటీ, పిక్సర్ బ్రౌజర్, వెబ్ బ్రౌజర్, నెట్‌వర్క్ సపోర్ట్ (2జీ, 3జీ డేటాకార్డ్), ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, గేమ్స్, 3.5ఎమ్ఎమ్ ఆడియో పోర్టు, స్టాండర్ట్ లయోన్ 2800mAh బ్యాటరీ , ధర అంచనా రూ.7,000.

రెండు గ్యాడ్జెట్‌లలో ఫ్రంట్ కెమెరాలు అమర్చినప్పటికి, ఆపరేటింగ్ సిస్టంలలో తేడాలను గమనించవచ్చు. మైక్రోమ్యాక్స్ ఫన్‌బుక్ అత్యాధునిక ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ వోఎస్‌ను ఒదిగి ఉంది. ధర అంశాలను పరిగణలోకి తీసుకుంటే మైక్రోమ్యాక్స్ ఫన్‌బుక్ తక్కువ ధరతో యువతను మరంత ఆకట్టుకంటుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot