ఆపిల్‌కు షాక్ మీద షాక్!

By Super
|
 Comparison of Google Nexus 7 with rivals

ప్రముఖ సెర్చ్ ఇంజన్ గుగూల్ బుధవారం నెక్సస్ 7 టాబ్లెట్ పీసీని ఆవిష్కరించింది. అసస్‌చే డిజైన్ చెయ్యబడిన ఈ కంప్యూటింగ్ గ్యాడ్జెట్ ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. గుగూల్ తాజా ఆవిష్కరణ, ఆపిల్ ఐప్యాడ్‌తో పాటు ఆమోజన్ కిండిల్ ఫైర్ టాబ్లెట్‌లకు కొత్త సవాల్‌ను విసిరనట్లయ్యింది. ఈ మూడు గ్యాడ్జెట్ల ప్రధాన ఫీచర్లను క్లుప్తంగా పరిశీలిద్దాం...

గగూల్ నెక్సస్ 7:

ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

1.3గిగాహెట్జ్ టెగ్రా 3 క్వాడ్ కోర్ ప్రాసెసింగ్ యూనిట్,

7 అంగుళాల టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1280 x 800పిక్సల్స్),

1.3 మెగా పిక్సల్ కెమెరా,

బరువు 0.75 పౌండ్లు,

బ్యాటరీ బ్యాకప్ (9.5గంటలు),

ధరలు 8జీబి వర్షన్ - 11,000, 16జీబి వర్షన్- 14,000.

ఆమోజన్ కిండిల్ ఫైర్:

ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 512ఎంబీ ర్యామ్,

7 అంగుళాల టచ్‌స్ర్కీన్ ( 1024 x 600పిక్సల్స్),

బరువు 0.9 పౌండ్లు,

బ్యాటరీ బ్యాకప్ (8 గంటలు),

ధర 6జీబి వర్షన్ - ధర రూ.11,000.

ఆపిల్ ఐప్యాడ్:

ఐవోఎస్ 5,

1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 512 ఎంబీ ర్యామ్,

9.7 అంగుళాల టచ్‌స్ర్కీన్ ( 2048 x 1536పిక్సల్స్),

1.3మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

1.44పౌండ్లు,

బ్యాటరీ బ్యాకప్ 10 గంటలు,

16జీబి వర్షన్ ధర రూ 30,000, 64జీబి వర్షన్ ధర రూ.40,000.

గుగూల్ నెక్సస్ 7 టాబ్లెట్‌ను గుగూల్ ప్లే స్టోర్ ద్వారా విక్రయించనున్నారు. జూలై 15 నుంచి ఈ డివైజ్ అందుబాటులోకి రానుంది. నెక్సస్ 7 ప్రధాన లోపాన్ని పరిగణలోకి తీసుకుంటే మెమరీని పెంచుకునేందుకు వీలుగా మెమరీ కార్డ్ స్లాట్ వ్యవస్థ లోపించింది. అదేవిధంగా సిమ్‌కార్డ్ స్లాట్‌ను అమర్చలేదు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X