అయితే గెలుపెవరిదో.?

Posted By: Prashanth

అయితే గెలుపెవరిదో.?

 

దేశీయ కంపెనీలు హెచ్‌సీఎల్ అదేవిధంగా మైక్రో‌మ్యాక్స్ కొద్ది రోజుల క్రితం మార్కెట్లో రెండు టాబ్లెట్ కంప్యూటర్లను లాంఛ్ చేశాయి. విద్యకు సంబంధించి వివిధ విభాగాల స్టడీ మెటీరియల్‌ను ఈ పీసీల్లో ముందుగానే ఇన్‌బుల్ట్ చేశారు. హార్డ్‌వేర్ విషయంలో సమాన ప్రాతిపదికను కలిగి ఉన్న ఈ రెండు డివైజ్‌లు ధర ఇతర కాన్ఫిగరేషన్‌ల విషయాల్లో స్వల్ప తేడాలు కలిగి ఉన్నాయి. వాటిని క్షుణ్నంగా పరిశీలిద్దాం..

హెచ్‌సీఎల్ మీ ట్యాబ్ యూ1:

. 7 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 800 x 480 పిక్సల్స్)

. ఆండ్రాయిడ్ 4.0.3 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

. 1 జిగాహెడ్జ్ ఆర్మ్ ఏ8 ప్రాసెసర్,

. 512ఎంబీ డీడీఆర్3 ర్యామ్,

. వీజీఏ ఫ్రంట్ కెమెరా,

. హెచ్‌డిఎమ్ఐ అవుట్,

. యూఎస్బీ కనెక్టువిటీ.

. వై-ఫై,

. 3600 mAh బ్యాటరీ,

. ధర రూ.7,999.

మైక్రోమ్యాక్స్ ఫన్‌బుక్:

* 7 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 800 x 480 పిక్సల్స్)

* ఆండ్రాయిడ్ 4.0.3 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

* 1.2 జిగాహెడ్జ్ ఆర్మ్ ఏ8 ప్రాసెసర్,

* 512ఎంబీ డీడీఆర్3 ర్యామ్,

* వీజీఏ ఫ్రంట్ కెమెరా,

* హెచ్‌డిఎమ్ఐ అవుట్,

* యూఎస్బీ కనెక్టువిటీ.

* వై-ఫై,

* 2800 mAh బ్యాటరీ,

* ధర రూ.6,499.

ప్రాసెసర్ అదేవిధంగా ధర విషయంలో హెచ్‌సీఎల్ వెనుకబడి ఉంది. ఒక్క బ్యాటరీ విషయంలోనే మైక్రోమ్యాక్స్ వెనుకుంది. మైక్రో‌మ్యాక్స్ ఫన్‌బుక్ కోనుగోలు చేసే వినియోగదారుడు టాటా ఫూటాన్ EVDO డేటా కార్డును ఉచితంగా పొందవచ్చు. కొన్ని నెలల పాటు ఈ కార్డ్ నుంచి 1జీజి డేటా వరకు ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot