ఆ ఇద్దరూ ఫేస్ టూ ఫేస్!!

Posted By: Prashanth

ఆ ఇద్దరూ ఫేస్ టూ ఫేస్!!

 

టాబ్లెట్ కంప్యూటర్ల విపణిలోకి ఆరంగ్రేటం చేసిన మైక్రోమ్యాక్స్‌కు, ఐబెర్రీ రూపంలో గట్టి పోటీ ఎదురైంది. మైక్రో‌మ్యాక్స్ రూపొందించిన ‘ఫన్ బుక్’కు, ఐబెర్రీ డిజైన్ చేసిన ‘ఆక్సస్ ఏఎక్స్02’ పోటీదారుగా బరిలో నిలిచింది. వీటి స్పెసిఫికేషన్‌లలోని వృత్యాసాన్ని క్లుప్తంగా పరిశీలిద్దాం..

మైక్రోమ్యాక్స్ ఫన్‌బుక్:

7 అంగుళాల మల్టీ టచ్ స్ర్కీన్, బరువు 350 గ్రాములు, ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, 1.2 గిగాహెడ్జ్ ప్రాసెసర్, మాలీ 400 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, హై డెఫినిషన్ వీడియో రికార్డింగ్, 512ఎంబీ డీడీఆర్3 ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, బాహ్య మెమరీ 32జీబి, వై-ఫై, 3జీ, యూఎస్బీ కనెక్టువిటీ, పిక్సర్ బ్రౌజర్, వెబ్ బ్రౌజర్, నెట్‌వర్క్ సపోర్ట్ (2జీ, 3జీ డేటాకార్డ్), ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, గేమ్స్, 3.5ఎమ్ఎమ్ ఆడియో పోర్టు, స్టాండర్ట్ లయోన్ 2800mAh బ్యాటరీ, ధర రూ.6,500.

ఐబెర్రీ ఆక్సస్:

7 అంగుళాల మల్టీ టచ్‌స్ర్కీన్, బరువు 702 గ్రాములు, ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, 1.0గిగా హెడ్జ్ ప్రాసెసర్, 400మెగాహెడ్జ్ జీఎల్ 2.0 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, హై డెఫినిషన్ వీడియో రికార్డింగ్, 1జీబి డీడీఆర్3 ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, 3జీ, వై-ఫై, యూఎస్బీ కనెక్టువిటీ, వెబ్ బ్రౌజర్, నెట్‌వర్క్ సపోర్ట్ 2జీ (జీఎస్ఎమ్), 3జీ (హెచ్ఎస్ పీఏ), ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, గేమ్స్ర్, స్పీకర్స్, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, రీఛార్జబుల్ లై-పోలీ 4000MAh బ్యాటరీ, ధర రూ.9,990.

సమాన పరిమాణాల్లో డిస్ ప్లేలను కలిగి ఉన్న ఈ డివైజ్‌లు ఒకే రకమైన ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతున్నాయి. అయితే మైక్రోమ్యాక్స్ ఫన్ బుక్ కేవలం ఫ్రంట్ కెమెరా వ్యవస్థను మాత్రమే కలిగి ఉంది. బ్యాటరీ విషయంలోనూ ఫన్‌బుక్ వెనుకబడి ఉంది. ప్రాసెసర్ అదే విధంగా బరువు విషయంలో తేడాలను గమనించవచ్చు. ధరలను పరిశీలిస్తే మైక్రోమ్యాక్ప్ ఫన్ బుక్ విలువ రూ.6,500 ఉండగా ఐబెర్రీ ఆక్సస్ ఏఎక్స్02 ధర రూ.9,990గా ఉంది. ఎంపిక విషయంలో తుది నిర్ణయం మీదే.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot