ఆకాష్‌కు పోటీగా క్లాస్‌ప్యాడ్!!!

Posted By: Staff

ఆకాష్‌కు పోటీగా క్లాస్‌ప్యాడ్!!!

 

ప్రపంచపు అతి చవకైన టాబ్లెట్‌గా గుర్తింపుతెచ్చుకున్న ‘ఆకాష్’ గడిచిన ఏడాది విడుదలై రిటైల్ మార్కెట్లో హాట్ కేకులా అమ్ముడవుతోంది. ఈ సక్సెస్ స్టోరీని మరవక ముందే మరో బడ్జెట్ టాబ్లెట్ ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించింది. ‘క్లాస్ ప్యాడ్’గా డిజైన్ కాబడిన ఈ దేశీయ టాబ్లెట్ ఆకాష్‌తో పోలిస్తే ఉత్తమ ఫీచర్లను ఒదిగి ఉంది.

ఆకాష్ ఫీచ్లర్లు:

* 7 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 800 x 480 పిక్సల్స్), * ధృడమైన టచ్ సామర్ధ్యం, * ర్యామ్ పరిమాణం 256 ఎంబీ, * 2జీబి ఇంటర్నల్ ఫ్లాష్ మెమరీ, * ఎక్స్‌ప్యాండబుల్ విధానం ద్వారా మెమరీని 32 జీబికి పెంచుకోవచ్చు, * జీపీఆర్ఎస్, బ్లూటూత్, యూఎస్బీ కనెక్టువిటీ, WLAN,* ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, * ఆండ్రాయిడ్ v2.2 ఫ్రోయో ఆపరేటింగ్ సిస్టం, * 366 MHz కోనెక్సంట్ ప్రాసెసర్, * గ్రాఫిక్ యాక్సిలరేటర్, * బ్యాటరీ బ్యాకప్ 3 గంటలు.

క్లాస్ ప్యాడ్ ఫీచర్లు:

* ఈ టాబ్లెట్ 7.1, 8, 10 అంగుళాల స్ర్కీన్ వేరియంట్‌లలో లభ్యమువుతుంది రిసల్యూషన్ సామర్ధ్యం (1024 x 768 పిక్సల్ష్), * టచ్ సామర్ధ్యం, * ర్యామ్ పరిమాణం 512 ఎంబీ, * 4జీబి ఇంటర్నల్ మెమరీ, * ఎక్స్‌ప్యాండబుల్ విధానం ద్వారా మెమరీని 32 జీబికి పెంచుకోవచ్చు, * జీపీఆర్ఎస్, బ్లూటూత్, యూఎస్బీ కనెక్టువిటీ, WLAN,* ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, * ఆండ్రాయిడ్ v2.2 ఫ్రోయో ఆపరేటింగ్ సిస్టం, * 1.3 GHz ప్రాసెసర్,

ఆకాష్‌కు మెరుగైన వర్షన్‌గా క్లాస్‌ప్యాడ్‌ను భావించవచ్చు. విద్యావసరాలకు దోహదపడే విధంగా చదువు సంబంధిత లెర్నింగ్ అప్లికేషన్‌లను ఈ డివైజ్‌ల్లో నిక్షిప్తం చేశారు. రిటైల్ మార్కెట్లో ఆకాష్ టాబ్లెట్ ధర రూ.2,500 ఉండగా, మూడు వేరియంట్‌లలో లభ్యమవుతున్న క్లాస్‌ప్యాడ్ టాబ్లెట్ ధరలు రూ.6,500 నుంచి రూ.14,500 వరకు ఉన్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot