2015లో సామ్‌సంగ్ ఫోల్డబుల్ ట్యాబ్లెట్

|
2015లో సామ్‌సంగ్ ఫోల్డబుల్ ట్యాబ్లెట్

స్మార్ట్ కమ్యూనికేషన్ ప్రపంచంలో నిత్యం కొత్త ఆవిష్కరణల కోసం పరితపించే సామ్‌సంగ్ మరో ఫ్లెక్సిబుల్ ఆవిష్కరణకు సన్నద్ధమవుతోంది. పలు అంతర్జాతీయ నివేదకల ఆధారంగా సేకరించిన వివరాల మేరకు సామ్‌సంగ్ 8 నుంచి 9 అంగుళాల నిడివి గల ఫోల్డింగ్ ట్యాబ్లెట్‌ను రూపకల్పన చేస్తోంది. వచ్చే ఏడాది ఆరంభంలో విడుదల ఈ డివైస్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ ట్యాబ్లెట్‌లో అమర్చిన ఓఎల్ఈడి పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లేను రెండుగా మడతపెట్టుకోవచ్చు. అంటే ట్యాబ్లెట్‌ను కాస్తా స్మార్ట్‌ఫోన్‌లా మార్చేసుకోవచ్చు. సామ్‌సంగ్ ఈ విప్లవాత్మక పోర్టబుల్ కంప్యూటింగ్ ఉత్పత్తిని 2015 ఆరంభంలో మార్కెట్‌కు పరిచయం చేసే అవకాశముందని మార్కెట్ వర్గాలు సమాచారం.

నోకియా కూడా అదే బాటలో...

శాన్‌డిగోలో జరిగిన ‘రీసెంట్ సొసైటీ ఫర్ డిస్‌ప్లే ఇన్ఫర్మేషన్ కాన్ఫిరెన్స్'లో భాగంగా నోకియా ప్రోటోటైప్ దశలో ఉన్న రెండు ఫోల్డబుల్ డిస్‌ప్లేలను ప్రదర్శించింది. ఈ 5.9 అంగుళాల ఫోల్డబుల్ డిస్‌ప్లేల రూపకల్పనలో భాగంగా నోకియా, సెమీ కండెక్టర్ ఎనర్జీ లాబరేటరీతో కలిసి పనిచేసింది. వీటిలో మొదటి ప్యానల్‌ను పస్తుకంలా రెండుగా మడత పెట్టుకోవచ్చు. రెండవ ప్యానల్‌ను మూడు మడతలుగా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఈ 5.9 అంగుళాల ఓఎల్ఈడి ప్యానల్స్ 1,280 x 720పిక్సల్ రిసల్యూషన్‌ను కలిగి ఉంటాయి. 249 పీపీఐ పిక్సల్ డెన్సిటీ. ఈ ప్రత్యేకమైన డిస్‌ప్లే ప్యానల్స్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్‌లను నోకియా ఎప్పుడు విడుదల చేస్తుందో వేచి చూడాలి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X