క్రోమా ఆండ్రాయిడ్ జెల్లీబీన్ టాబ్లెట్.. కేవలం రూ.5,999కే!

Posted By: Super

క్రోమా ఆండ్రాయిడ్ జెల్లీబీన్ టాబ్లెట్.. కేవలం రూ.5,999కే!

 

ఇండియాకు చెందిన ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ క్రోమా, ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆధారింతంగా స్పందించే సరికొత్త ‘క్రోమా సీఆర్ఎక్స్ టీ1075’టాబ్లెట్‌ను అధికారికంగా ఆవిష్కరించింది. ధర రూ.5,999. క్రోమాకు చెంది క్రోమో రిటైల్ డాట్ కామ్ ఈ ఆధునిక వర్షన్ కంప్యూటింగ్ గ్యాడ్జెట్‌ను తన లిస్టింగ్స్ లో పేర్కొంది.  ఆధునిక వర్షన్ ఆండ్రాయిడ్ టెక్నాలజీని టాబ్లెట్‌లో లోడ్ చేసారు. టాబ్లెట్‌లో నిక్షిప్తం చేసిన పలు ప్రీలోడెడ్ అప్లికేషన్స్ అనేక కొత్త అనుభూతులను యూజర్‌కు చేరువ చేస్తాయి. గెస్ట్యుర్ మోడ్ డివైజ్‌కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఈ టాబ్లెట్ కొనుగోలు పై క్రోమా ప్రత్యేక రాయితీలను కల్పిస్తుంది.

క్రోమా సీఆర్ఎక్స్ టీ1075 కీలక ఫీచర్లు:

చుట్టుకొలత ఇంకా బరువు: శరీర పరిమాణం 194 x 120 x 10.8మిల్లీమీటర్లు, బరువు 295 గ్రాములు,

డిస్ ప్లే: 7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్),

ప్రాసెసర్ ఇంకా స్టోరేజ్: 1గిగాహెడ్జ్ ఆర్మ్ కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్, 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 512 ఎంబీ ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

ఆపరేటింగ్ సిస్టం : ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్,

కెమెరా: 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), రేర్ కెమెరా వ్యవస్థ లోపించింది.

కనెక్టువిటీ: వై-ఫై 802.11 బి/జి/ఎన్, మైక్రోయూఎస్బీ 2.0, 3జీ.

బ్యాటరీ: 3000ఎమ్ఏహెచ్ లిపో బ్యాటరీ (168 గంటల స్టాండ్‌బై),

అదనపు ఫీచర్లు: డాక్యుమెంట్స్ టు గో, క్యాలెండర్, క్లాక్, యాంగ్రీ బర్డ్స్, వాయిస్ సెర్చ్, డాక్యుమెంట్ వ్యూవర్, జీమెయిల్,

ధర ఇతర వివరాలు: ధర రూ.5,990, దేశ వ్యాప్తంగా ఉన్న క్రోమా రిటైల్ స్టోర్‌ల ద్వారా క్రోమా జెల్లీబీన్ టాబ్లెట్‌ను సొంతం చేసుకోవచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot