క్రోమా, ఇంటెల్ నుంచి రెండు విండోస్ కంప్యూటింగ్ ఉత్పత్తులు

Posted By:

ప్రముఖ ఇండియన్ రిటైలర్ క్రోమా కంప్యూటర్ చిప్‌సెట్‌ల తయారీ కంపెనీ ఇంటెల్‌తో ఒప్పందాన్ని కదుర్చుకుని రెండు సరికొత్త పోర్టబుల్ కంప్యూటింగ్ డివైస్‌లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. వీటిలో 10.1 అంగుళాల 2 ఇన్ 1 టాబ్లెట్/పీసీ అలానే 8 అంగుళాల క్రోమా 1179 టాబ్లెట్‌లు ఉన్నాయి. 2 ఇన్ 1 పీసీ ధర రూ.21,990. టాబ్లెట్ ధర రూ.13,990. విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టం పై ఈ డివైస్‌లు రన్ అవుతాయి. ఇంటెల్ ఆటమ్ జెడ్3735డి 1.33 గిగాహెట్జ్ ప్రాసెసర్‌లను ఈ పోర్టబుల్ కంప్యూటింగ్ పరికరాల్లో నిక్షిప్తం చేసారు.

 క్రోమా, ఇంటెల్ నుంచి రెండు విండోస్ కంప్యూటింగ్ ఉత్పత్తులు

క్రోమా 1179 టాబ్లెట్ కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే:

8 అంగుళాల తాకేతెర (రిసల్యూషన్1280x 800పిక్సల్స్), విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టం, జెడ్3735డి 1.33 గిగాహెట్జ్ ఇంటెల్ ఆటమ్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 32జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా డివైస్ మెమరీని మరింతగా విస్తరించుకోవచ్చు. 5000 ఎమ్ఏమెచ్ లిథియమ్ పాలిమర్ బ్యాటరీ. వై-ఫై కనెక్టువిటీ.

క్రోమా 1172 2-ఇన్-1 టాబ్లెట్/పీసీ కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే:

10.1 అంగుళాల తాకేతెర, డివైస్‌ను ల్యాప్‌టాప్‌గా మార్చుకునేందుకు ప్రత్యేకమైన అటాచింగ్ కీబోర్డ్ వ్యవస్థ, విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టం,  జెడ్3735డి 1.33 గిగాహెట్జ్ ఇంటెల్ ఆటమ్ ప్రాసెసర్, 3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ, 2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా డివైస్ మెమరీని మరింతగా విస్తరించుకునే అవకాశం. ఈ డివైస్‌ను అవసరానికి అనుగుణంగా ల్యాప్‌టాప్ అలానే టాబ్లెట్‌లా  ఉపయోగించుకోవచ్చు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot