డేటావిండ్ కొత్త మార్కెట్!

Posted By: Prashanth

డేటావిండ్ కొత్త మార్కెట్!

 

ఆకాష్ టాబ్లెట్ కంప్యూటర్ల తయారీ సంస్థ డేటావిండ్ తాను రూపొందించిన యూబీస్లేట్ టాబ్లెట్ పీసీ కోసం విడిభాగాలను తయారుచేస్తుంది. వీటి ధరలు అందరికి అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. డేటావిండ్ తీసుకున్న తాజా నిర్ణయం అదనపు సౌలభ్యతలను కాంక్షించే యూబీస్లేట్ యూజర్లకు మరింత లబ్ది చేకూర్చనుంది. డేటావిండ్ ప్రవేశపెట్టబోతున్న విడిభాగాల వివరాలు వాటి ధరలు.......

- బయోమెట్రిక్ స్కానర్ ధర రూ.4,000 (టాబ్లెట్ సెక్యూరిటీ అవసరాల దృష్ట్యా ఈ విడిభాగం కీలకం),

- శాటిలైట్ హార్డ్ డ్రైవ్ ధర రూ.9,900,

- బ్యాటరీ ఎక్స్‌టెండర్ (సోలార్ రకం) ధర రూ.550,

- బ్యాటరీ ఎక్స్‌టెండర్ (డబల్ లైఫ్) ధర రూ.800,

- యూఎస్బీ మెమరీ డ్రైవ్ 4జీబి రూ.450,

- యూఎస్బీ మెమరీ డ్రైవ్ 8జీబి రూ.800,

- ఇంటిగ్రేటెడ్ వాల్యుమ్ వ్యవస్థతో కూడిన మైక్రో ఫోన్ ఇంకా ఇయర్ పీస్ ధర రూ.300,

- బార్‌కోడ్ స్కానర్ (యూఎస్బీ కనెక్టువిటీ సౌలభ్యతతో) ధర రూ.16,00,

- జియో ఫ్లెక్స్ హెచ్‌డిడి ( వై-ఫై ఆధారిత) ధర రూ.10,000.

- సురక్షిత టాబ్లెట్ కేస్ రూ.800.

- స్ర్కీన్ ప్రొటెక్టర్స్,

- నియోప్రీన్ పౌచ్,

- స్లీవ్స్,

- సిలికాన్ కవర్స్

యూబీస్లేట్ టాబ్లెట్ పీసీ వినియోగాన్ని కార్లలో సైతం సమర్ధవంతంగా వినియోగించుకునే క్రమంలో అదనపు విడిభాగాలను డేటావిండ్ డిజైన్ చేసింది వాటి వివరాలు:

కార్ ఛార్జర్ రూ.300,

సిగ్నలింగ్ వ్యవస్థను బలోపేతం చేసే ఎక్స్ టర్నల్ యాంటినా ధర రూ.350.

ప్రస్తుతానికి వీటిలో కొన్ని మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అన్ని విడిభాగాలను త్వరలోనే అందుబాటులోకి తేనున్నారు. ఔత్సాహికులు తమకు నచ్చిన విడిభాగాన్ని డేటావిండ్ ఆన్‌లైస్ స్టోర్‌లోకి వీటిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot