ఆకాష్ ఆర్డర్లు ఆరు వారాల్లో క్లియర్!

Posted By: Prashanth

ఆకాష్ ఆర్డర్లు ఆరు వారాల్లో క్లియర్!

 

ఆకాష్ టాబ్లెట్ కంప్యూటర్‌లను ముందుగా బుక్ చేసుకున్న వారికి శుభవార్త... ఆకాష్ ట్యాబ్లెట్ కమర్షియల్ వెర్షన్‌కు సంబంధించిన ఆర్డర్లన్నింటినీ ఆరు వారాల్లో క్లియర్ చేస్తామని డేటావిండ్ సీఈవో సునీత్ సింగ్ తులి ఒక ప్రకటనలో తెలిపారు. సిమ్ స్లాట్‌లేని ‘యూబిస్లేట్ 7ఆర్ఐ’, ‘యూబిస్లేట్ 7సీఐ’ వర్షన్‌లకు సంబంధించిన ఆర్డర్లను పది రోజుల్లో, సిమ్ స్లాట్‌తో కూడిన ‘యూబిస్లేట్ 7ఆర్+’, ‘యూబిస్లేట్ 7సీ+’ వర్షన్‌లకు సంబంధించిన ఆర్డర్లను 4 నుంచి 6వారాల్లో క్లియర్ చేస్తామని ఆయన వివరించారు. ఈ నాలుగు డివైజ్‌లలో యూబిస్లేట్ ‘7ఆర్ఐ’, ‘7ఆర్+’ మోడళ్లు రెసిస్టివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లేను కలిగి ఉంటాయి. మరో రెండు మోడళ్లు ‘7సీఐ’, ‘7సీ+’లు కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లేలను కలిగి ఉంటాయి.

ఈ నాలుగు టాబ్లెట్‌లకు సంబంధించి కీలక ఫీచర్లు:

ఆండ్రాయిడ్ 4.0.3 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,

7 అంగుళాల స్ర్కీన్, రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్,

1గిగాహెడ్జ్ కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్,

512ఎంబి ర్యామ్,

4జీబి ఇంటర్నల్ స్టోరేజ్,

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

వీజీఏ ప్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),

వై-ఫై,

మినీ యూఎస్బీ పోర్ట్.

ప్రస్తుతానికి రోజుకు 2500 నుంచి 3000 వరకు టాబ్లెట్‌లను తయారు చేస్తున్నామని సిమ్ ఆధారిత ట్యాబ్లెట్‌ల తయారీని రెండు వారాల్లో ప్రారంభిస్తామని సునీత్ సింగ్ ఈ సందర్భంగా తెలిపారు. ఇప్పటికే ఆర్డర్ చేసి ట్యాబ్లెట్ అందేదాకా వేచి చూడని వారికి డబ్బులు తిరిగి ఇచ్చేస్తామని పేర్కొన్నారు.

Read In English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot