డేటావిండ్ టాబ్లెట్‌ల పై ఏడాది ఉచిత ఇంటర్నెట్

Posted By:

డేటావిండ్ టాబ్లెట్‌ల పై ఏడాది ఉచిత ఇంటర్నెట్

తమ యుబిస్లేట్ టాబ్లెట్ డివైస్‌ల కొనుగోలు పై ఏడాది ఉచిత ఇంటర్నెట్‌ను అందిస్తున్నట్లు ఆకాష్ టాబ్లెట్‌ల తయారీ కంపెనీ డేటావిండ్ తెలిపింది. యుబి‌స్లేట్ టాబ్లెట్ పీసీల కొనుగోలు పై సంవత్సరం పాట అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్‌ను అందించనున్నట్లు డేటావిండ్ సంస్థ సీఈఓ సునీత్ సింగ్ తులి చెప్పారు.

డేటావిండ్ టాబ్లెట్‌ల పై ఏడాది ఉచిత ఇంటర్నెట్

ఇదిలా ఉండగా దక్షిణాది మార్కెట్లో యుబిస్లేట్ టాబ్లెట్‌లను విక్రయించడానికి మొబైల్ రిటైల్ సంస్థ ‘యూనివర్‌సెల్'తో డేటావిండ్ ఒప్పందం కుదుర్చుకుంది. ప్రభుత్వ రంగ టెలికామ్ సంస్థ బీఎస్ఎన్ఎల్ భాగస్వామ్యంతో తమ యుబిస్లేట్ 7సీజెడ్ (రూ.5,999), యుబిస్లేట్ 3జీ7 (రూ.6,999) ట్యాబ్లెట్ పీసీల కొనుగోలు పై ఉచిత ఇంటర్నెట్‌ను అందిస్తున్నట్లు తులి తెలిపారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot