రూ.11399 నుంచే Eye ప్రొటెక్షన్ ఫీచర్, అధిక రీఫ్రెష్ రేట్‌తో Dell మానిటర్లు.. సేల్ ప్రారంభం!
Dell 2025 Plus Series monitors : ప్రముఖ కంప్యూటర్‌లు, ల్యాప్‌టాప్ ల తయారీ సంస్థ Dell తాజాగా అనేక కంప్యూటర్ మానిటర్లను లాంచ్ చేసింది. అందుబాటు ధరలోనే వీటిని తీసుకొచ్చింది. ఇందులో Dell 24, Dell 27 ప్లస్, Dell 27 ప్లస్ QHD, 27 ప్లస్ QHD USB-C మోడల్స్ ను తీసుకొచ్చింది. ప్రస్తుతం మానిటర్లు కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉన్నాయి. వీటి స్పెసిఫికేషన్ లు, ధర, సేల్ పూర్తి వివరాలు.
ఈ కంప్యూటర్ మానిటర్లు విద్యార్థులు, నిఫుణులు ఇళ్లల్లో, కార్యాలయాల్లో ఉపయోగించుకొనేందుకు అనువుగా ఉంటాయని చెబుతోంది. క్లారిటీ, కంఫర్ట్, సింప్లిసిటీలతో కూడిన అనుభూతిని అందిస్తుందని చెబుతోంది. డిజైన్ కూడా ఆకట్టుకుంటుంది. అనువైన స్టాండ్ తో, సర్దుబాటు చేసుకొనే విధంగా మానిటర్లు ఉన్నాయి.

144Hz రీఫ్రెష్ రేట్ :
కొత్తగా డెల్ తీసుకొచ్చిన కంప్యూటర్ మానిటర్లు 144Hz రీఫ్రెష్ రేట్, 1 ms మోషన్ పిక్చర్ రెస్పాన్స్ టైం (MPRT) ను కలిగి ఉంది. ఈ IPS మానిటర్లు AMD FreeSync ఫీచర్ ను సపోర్టు చేస్తుంది. ఫుల్ HD, క్వాడ్ HD ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది.
ఫలితంగా విజువల్ గా ఆకట్టుకొనే అవకాశం ఉంది. ఇళ్లల్లో సహా చిన్న కార్యాలయాల్లో ఉపయోగించుకొనేందుకు అనువుగా ఉంటాయి. ఎంటర్‌టైన్‌మెంట్ సహా ఇతర అవసరాల కోసం సౌకర్యంగా ఉపయోగించుకోవచ్చు. తక్కువ ధరలో అందుబాటులో ఉంది.
ఐ ప్రొటెక్షన్ ఫీచర్ :
ఈ మానిటర్లను ఎక్కువ సమయం ఉపయోగించినా కళ్లకు ఇబ్బంది లేకుండా ఉండేలా TUV Rheinland 4 స్టార్ సర్టికేషన్ ను కలిగి ఉన్నాయి. ఈ ఫీచర్ కారణంగా ఎక్కువ సమయం ఉపయోగించినా కళ్లు అలసిపోకుండా ఉంటాయని చెబుతోంది.
బిల్ట్ ఇన్ 3W స్పీకర్ :
ఈ మానిటర్లు 3W బిల్ట్-ఇన్ సౌండ్ స్పీకర్లను కలిగి ఉంది. సినిమాలు, వెబ్‌సిరీస్ లు చూస్తున్నప్పుడు, యూట్యూబ్ బ్రౌజింగ్ లేదా వర్చువల్ మీటింగ్స్ సమయాల్లో సౌకర్యంగా ఉపయోగించుకోవచ్చు. ఇన్-బిల్ట్ స్పీకర్లు మినహా ఎటువంటి అదనపు స్పీకర్ల అవసరం లేకుండా మెరుగైన సౌండ్ అవుట్‌పుట్ ను పొందవచ్చు. దీంతోపాటు యూజర్ల అవసరాలకు అనుగుణంగా సౌండ్ ప్రొఫైల్ లో మార్పులు చేసుకోవచ్చు.
Dell మానిటర్ల ధర, సేల్ వివరాలు :
> Dell 24 ప్లస్ మానిటర్ ( S2425HSM ) ధర రూ.11,399 గా ఉంది.
> Dell 27 ప్లస్ మానిటర్ ( S2725HSM ) ధర రూ.14,499 గా ఉంది.
> Dell 27 ప్లస్ QHD మానిటర్ ( S2725DSM ) ధర రూ.22,399 గా ఉంది.
> Dell 27 ప్లస్ USB- C మానిటర్ ( S2725DC ) ధర రూ.23699 గా ఉంది.
భారత్ మార్కెట్ లో ప్రస్తుతం ఈ మానిటర్లు ( Dell monitors 2025 ) కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉన్నాయి. Dell ఆన్‌లైన్ మరియు భాగస్వామ్య రిటైల్ స్టోర్ లలో కొనుగోలు చేయవచ్చు.


Click it and Unblock the Notifications








