ఇండియాలో డెల్ చవక కంప్యూటర్!!

Posted By: Staff

ఇండియాలో డెల్ చవక కంప్యూటర్!!

 

ప్రముఖ అంతర్జాతీయ ఐటీ సంస్థ డెల్(Dell)చవకైన టాబ్లెట్ కంప్యూటర్‌ను భారత్‌లో ప్రవేశపెట్టనుంది. ఆపిల్ కొత్త ఐప్యాడ్‌తో పోటీ పడే విధంగా ఈ ప్రాజెక్టును డెల్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినట్లు సమాచారం. దేశంలో లభ్యమవుతున్న చవక టాబ్లెట్ పీసీలకు డెల్ బడ్జెట్ ఫ్రెండ్లీ టాబ్లెట్ ప్రధాన పోటీదారు కానుంది. పూర్తి స్థాయి కంప్యూటింగ్ ప్రమాణాలతో రూపుదిద్దుకున్న ఈ డివైజ్ సాధారణ వినియోగదారులతో పాటు కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చుతుంది. విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం పై ఈ టాబ్లెట్ రన్ అవుతుంది. టచ్ స్ర్కీన్ వ్యవస్థ మరింత ఆకట్టుకుంటుంది. ధర ఇతర వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot