13 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో డెల్ క్రోమ్‌బుక్

|

ప్రముఖ కంప్యూటింగ్ ఉత్పత్తుల తయారీ కంపెనీ Dell, తన 5000 సిరీస్ నుంచి సరికొత్త క్రోమ్‌బుక్
ల్యాప్‌టాప్‌ను మార్కెట్లో అనౌన్స్ చేసింది. స్టూడెంట్స్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన ఈ ల్యాప్‌టాప్ రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. అందులో ఒకటి 11 అంగుళాల క్లామ్‌షెల్ మోడల్ కాగా, రెండవది 2 ఇన్ 1 కన్వర్టబుల్ డిజైన్. ఈ రెండు ల్యాప్‌టాప్‌లు సింగిల్ చార్జ్ పై 13 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్‌ను అందించగలుగుతాయని డెల్ తెలిపింది.

 
13 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో డెల్ క్రోమ్‌బుక్

క్రోమ్‌బుక్ 5190 పేరుతో లభ్యంకానున్న ఈ ల్యాప్‌టాప్ 10,000 మైక్రో‌ డ్రాప్స్ వరకు తట్టుకోగలుగుతుందట. అంటే బెంచ్ పై నుంచి క్రింద పడినప్పటికి ఈ డివైస్ చెక్కుచెదరదు. ఈ రగ్గుడ్ ప్రూఫ్ డివైస్‌లోని స్ర్కాచ్ రెసిస్టెంట్ డిస్‌ప్లే పై ఎటువంటి గీతలకు పూర్తిగా దూరంగా ఉంటుందట.

ఇక బాడీ నిర్మాణం విషయానికి వచ్చేసరికి మన్నికైన మెటీరియల్‌ను ఉపయోగించి ఈ ల్యాపీని బిల్డ్ చేసినట్లు డెల్ తెలిపింది.

క్లాస్‌రూమ్ వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని డిజైన్ చేయబడిన ఈ ల్యాపీలో క్లాస్‌రూమ్ మొత్తాన్ని క్యాప్చుర్ చేసుకునే విధంగా వరల్డ్ ఫేసింగ్ కెమెరాను ఏర్పాటు చేసినట్లు డెల్ తెలిపింది. ఈ ల్యాపీలో నోట్స్ రైటింగ్ అలానే స్కెచ్చింగ్ అవసరాలను తీర్చుకునేందుకు యాక్టివ్ స్టైలస్‌‌ కూడా అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది.

అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో నోకియా 3310 4G దిగింది బాసూ !అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో నోకియా 3310 4G దిగింది బాసూ !

ఈఎమ్ఆర్ పెన్ సపోర్ట్, యూఎస్బీ టైప్-సీ కనక్టువిటీ, వరల్డ్ ఫేసింగ్ కెమెరా, క్వాడ్-కోర్ ఇంటెల్ సెలిరాన్ ప్రాసెసర్ వంటి విప్లవాత్మక ఫీచర్లతో వస్తోన్న డెల్‌ క్రోమ్‌బుక్ బేస్ వేరియంట్ ధర రూ.18,500గా ఉంటుంది. ఫిబ్రవరి నుంచి ఈ డివైస్ మార్కెట్లో లభ్యమవుతుంది.

Best Mobiles in India

Read more about:
English summary
Dell Chromebook 5190 has been launched under the company’s Chromebook 5000 series. This is a laptop designed for students and comes in two variants. One is an 11-inch clamshell model and the other a 2-in-1 convertible model. The highlight of this laptop is its 13 hours of battery life and rugged nature.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X