ఆ సమస్యలకు పరిష్కారం‘డెల్’ మాత్రమేనా..?

Posted By: Staff

ఆ  సమస్యలకు పరిష్కారం‘డెల్’ మాత్రమేనా..?

 

ల్యాప్‌టాప్‌ల ఎంపికలో రెండు విధానాలున్నాయి.  ‘ఒకటి పెద్దదిగా ఉన్నది ఎంచుకోవటం.. రెండోది చిన్న కాంపాక్ట్ సైజ్‌లో సెలక్ట్ చేసుకోవటం’. పెద్ద స్ర్కీన్ పరిమాణం కలిగిన ల్యాపీ బరువు విషయంలో  హెచ్చుగానే ఉంటుంది. ఈ విధమైన గ్యాడ్జెట్ ప్రయాణ సందర్భాల్లో స్వల్ప ఆసౌకర్యానికి లోను చేస్తుంది.  కాంపాక్ట్‌గా డిజైన్ కాబడిన ల్యాప్‌టాప్ పని తీరు విషయంలో బేషుగ్గా స్పందించినప్పటికి  స్ర్కీన్ పరిమాణం విషయంలో నిరుత్సాహానికి గురి చేస్తుంది.

ల్యాప్‌టాప్ వినియోగదారులకు కొరకరాని కొయ్యిగా మారిని ఈ సమస్యకు  పరిష్కారం వెతికే పనిలో  ‘డెల్’ (Dell) నిమగ్నమయ్యింది. ఈ క్రమంలో  ‘ఇన్స్‌పిరాన్  N4050’ మోడల్‌లో ఓ అత్యుత్తమ ల్యాపీని డిజైన్ చేసింది. విండోస్ 7 హోమ్ బేసిక్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అయ్యే ఈ డివైజ్ బరువు 2.2 కిలో గ్రాములు. స్ర్కీన్ పరిమాణం 14 అంగుళాలు, హై డెఫినిషన్ సామర్ధ్యంతో డిస్‌ప్లే,  హార్డ్‌డిస్క్ శక్తి 500జీబి, 4జీబి ర్యామ్.

ల్యాపీలో దోహదం చేసే సెకండ్ జనరేషన్ ఇంటెల్ ప్రాసెసర్ i3 లేదా i5, మీ ఎంపికను బట్టి ఉంటుంది. ఇంటెల్ హై డెఫినిషన్ గ్రాఫిక్ వ్యవస్థ, ఇంటెల్ హై డెఫినిషన్ ఆడియో, హెచ్డీఎమ్ఐ పోర్ట్, యూఎస్బీ 2.0, బ్లూటూత్, వీజీఏ పోర్ట్, ఇతర్‌నెట్,  ఇంటిగ్రేటెడ్ 1.3 మెగా  పిక్సల్ వెబ్‌కెమెరా. ఎనలాగ్ మైక్రో ఫోన్, ఆడియో జాక్, మెమరీ కార్డ్ రీడర్, కెన్సింగ్ టన్ లాక్, లితియమ్ ఐయాన్ బ్యాటరీ వ్యవస్థ,

ఉపయుక్తమైన ఫీచర్లతో రూపుదిద్దుకున్న ‘ఇన్స్ ఫిరాన్  N4050’ పూర్తి స్థాయి పని వాతావరణాన్ని మీకు కల్పిస్తుంది. ఈ ల్యాపీ వినయోగం ద్వారా ఏ విధమైన ఆసౌకర్యానికి మీరు లోనుకారు. ఇండియన్ మార్కెట్లో ఈ సమజంసమైన గ్యాడ్జెట్ ధర రూ.31,000.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot