ఇక నెలసరి వాయిదాలతో ‘డెల్ ల్యాపీ’లను సొంతం చేసుకోండి ..!!

Posted By: Staff

ఇక నెలసరి వాయిదాలతో ‘డెల్ ల్యాపీ’లను సొంతం చేసుకోండి ..!!

‘‘అవును మీరు వింటున్నది నిజమే..!! వినియోగదారులకు రంజాన్, వినాయకచవితిల కానుకలుగా ‘డెల్’ నూతన శ్రేణి ల్యాప్‌టాప్‌లను మార్కెట్లో విడుదల చేసింది. ఈ ల్యాపీలను ‘రుణ పద్ధతి’లో మీ సొంతం చేసుకోవచ్చు...మరీ ఇంకెందుకండి ఆలస్యం మీ సంతోషాలను ఈ పండుగ నుంచే మొదలెట్టండి’’...

అన్నివిధాలా వినియోగదారునికి ఉపయుక్తంగా నిలిచే నూతన శ్రేణి ల్యాపీలను ‘డెల్’ ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసింది. డెల్ ‘ఇన్స్‌పిరాన్ 13Z’ ,
‘ఇన్స్‌పిరాన్ 14R’ల పేర్లతో సరికొత్త కంప్యూటింగ్ పరికారలు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. నిర్థిష్టమైన ఇంజనీరింగ్ విలువలతో ఈ ల్యాపీలను డిజైన్ చేశారు. ఆకర్షనీయమైన డిజైన్లలలో రూపొందించబడిన 14R ల్యాపీలు పీకాక్ బ్లూ, టమోటో రెడ్ రంగుల్లో చూడగానే ఆకట్టకునే విధంగా దర్శనమిస్తున్నాయి.

‘ఇన్స్‌పిరాన్ 13Z’ అద్భతమైన ఫ్రొఫైల్‌తో రూపొందించారు తక్కువు బరువు కలిగిన ఈ ల్యాపీని ఎక్కడికైనా సునాయశంగా తీసుకెళ్లవచ్చు. హై డెఫినిషన్ డిస్ప్లే, నాణ్యమై వెబ్ క్యామ్, సోషల్ నెట్‌వర్కింగ్ వంటి అంశాలు వినియోగదారునికి మరింత లబ్ధని చేకూరుస్తాయి. ‘ఇన్స్‌పిరాన్ 14R’లో పొందుపరిచిన 1.3 మెగా పిక్సల్ వెబ్‌క్యామ్, మెమరీ సామర్ధ్యం, గ్రాఫిక్ సపోర్టు వంటి అంశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. జెన్యున్ విండోస్ 7 ఆపరేటింగ్ వ్యవస్థ ఆధారింతంగా ఈ రెండు ల్యాపీలు పనిచేస్తాయి. ర్యామ్ అంశాలను పరిశీలిస్తే ‘14R’ 6 GB సామర్థ్యం కలగి ఉంది. ‘13Z’ 4జీబీ ర్యామ్ సామర్థ్యం కలిగి ఉంది.

డిస్‌ప్లే అంశాలను పరిశీలిస్తే ‘13Z’ 13.3 అంగుళాల సైజు కలిగి ఉండగా, 14R 14 డిస్‌ప్లే కలిగి ఉంది. డేటా ట్రాన్స్‌ఫర్ అంశాలకు సంబంధించి ఏర్పాటు చేసిన బ్లూటూత్, వై ఫై వ్యవస్థలు నిక్కచ్చిగా పనిచేస్తాయి. ల్యాపీలలో పొందుపరిచిన నాణ్యమైన బ్యాటరీ వ్యవస్థ దీర్ఘకాల మన్నికను కలిగి ఉంటుంది. వీటి ధరల విషయానికొస్తే ‘13Z’ మార్కెట్ ధర రూ. 36,800 ఉండగా, ‘14R’ ధర రూ.30,500 ఉంది. అయితే వీటిని నెలసరి వాయిదాలు ద్వారా మీ సొంతం చేసుకోవచ్చు. వివరాల కోసం మీ దగ్గరలోని ‘డెల్ డీలర్‌ను సంప్రదించండి’.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting