మోజు పెంచుతున్న ‘డెల్’ కొత్త ఎడిషన్!!

Posted By: Prashanth

మోజు పెంచుతున్న ‘డెల్’ కొత్త ఎడిషన్!!

 

ల్యాప్‌టాప్ మార్కెట్లో తాజాగా వినిపిస్తున్న పేరు ‘డెల్ ఇన్స్‌పిరాన్ 15ఆర్’.ఈ స్పెషల్ ఎడిషన్ ల్యాపీలో శక్తివంతమైన ఐవీ బ్రిడ్జ్ ప్రాసెసర్‌ను నిక్షిప్తం చేశారు. ఈ కలయకతో కంప్యూటింగ్ మరింత వేగవంతంగా, యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. డెల్ తాజా చర్య పట్ల గ్యాడ్జెట్ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

డెల్ ఇన్స్‌పిరాన్ 15ఆర్ కీలక ఫీచర్లు:

15 అంగుళాల హైడెఫినిషన్ ఎల్‌సీడీ డిస్‌ప్లే స్ర్కీన్,

64-బిట్ విండోస్ 7 హోమ్ ప్రీమియమ్ ఆపరేటింగ్ సిస్టం,

ఏఎమ్‌డి రాడియన్ హైడెఫినిషన్ 7730 గ్రాఫిక్ వ్యవస్థ,

4జీబి సామర్ధ్యం గల డీడీఆర్3 ర్యామ్,

2జీబి సామర్ద్యం గల వీడియో ర్యామ్,

ఇంటెల్ కోర్ ఐ7-3612క్యూఎమ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,

ప్రాసెసర్ వేగం 2.10గిగాహెడ్జ్,

ఇంటెల్ హెచ్ఎమ్77 ఎక్స్‌ప్రెస్ చిప్‌సెట్,

వీజీఏ పోర్టు,

750జీబి హార్డ్‌డ్రైవ్,

హైడెఫినిషన్ వెబ్‌క్యామ్,

8ఇన్1 కార్డ్ రీడర్,

ఇన్-బుల్ట్ స్టీరియో స్పీకర్ వ్యవస్థ,

డిజిటల్ మైక్రోఫోన్,

వై-ఫై కనెక్టువిటీ,

బ్లూటూత్,

యూఎస్బీ 3.0 పోర్టు,

హెచ్ డిఎమ్ఐ పోర్టు,

మైక్రోఫోన్,

4 వేవ్స్ మ్యాక్స్ ఆడియో టెక్నాలజీ,

బ్యాటరీ లైఫ్ 6 గంటలు,

డీవీడీ సూపర్ మల్టీ డ్రైవ్.

ఈ ల్యాపీ రెండు డిస్‌ప్లే మోడళ్లలో లభ్యం కానుంది. వీటిలో మొదటిది హెచ్‌డి WLED డిస్‌ప్లే కాగా రెండోది ఎఫ్‌హెచ్‌డి True-Life డిస్‌ప్లే. నిక్షిప్తం చేసిన ఇంటెల్ రాపిడ్ స్టార్ట్ స్మార్ట్ రెస్‌పాన్స్ ఫెసిలిటీ ల్యాపీని సెకన్ల వ్యవధిలో మేల్కొల్పుతుంది. ముందుగానే నిక్షిప్తం చేసిన స్కల్ క్యాండీ ఆడియో టెక్నాలజీ ఉత్తమ క్వాలిటీ సౌండ్ అనుభూతులను చేరువ చేస్తుంది. అమర్చిన 6 సెల్ బ్యాటరీ మన్నికైన బ్యాకప్ నిస్తుంది. హైడెఫినిషన్ వెబ్‌క్యామ్ ద్వారా అంతరాయంలేని వీడియో కాలింగ్ నిర్వహించుకోవచ్చు. పొందుపరిచిన ఐవీ బ్రిడ్జ్ ప్రాసెసర్, విండోస్ ఆపరేటింగ్ సిస్టం, గ్రాఫిక్ ప్రాసెసింగ్ వ్యవస్థలు మన్నికైన కంప్యూటింగ్‌ను అందిస్తాయి. మార్కెట్లో ధర అంచనా రూ.50,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot