మనసు దోచే ఫీచర్స్‌‌తో మార్కెట్లోకి డెల్..

Posted By: Staff

మనసు దోచే ఫీచర్స్‌‌తో మార్కెట్లోకి డెల్..

దేశంలో కంప్యూటర్స్ రంగంలో అగ్రగామిగా ఉన్న డెల్ సంస్ద త్వరలో మరో కొత్త కంప్యూటర్‌ని మార్కెట్లోకి విడుదల చేయనుంది. దానిపేరే 'డెల్ ఇన్సిపిరాన్ 620'. డెల్ ఇన్సిపిరాన్ 620 సిరిస్‌ క్యాబినెట్‌లో రెండు రకాల మోడల్స్ ఉన్నాయి. ఒకటి మిని టవర్. రెండవది స్లిమ్ టవర్. 18.5 ఇంచ్ డిస్ ప్లే స్క్రీన్‌‍ని కలిగి ఉండి, చూడడానికి స్టయిలిష్ డిజైన్ దీని సొంతం. టెక్ట్స్ ఇన్ పుట్స్‌ని ఇచ్చేందుకుగాను డెల్ కంపెనీ ప్రత్యేకంగా యుఎస్‌బి కీబోర్డ్‌ని అందిస్తుంది. దీనితో పాటు ప్రత్యేకంగా డెల్ MS111 యుఎస్‌బి ఆప్టికల్ మౌస్ కూడా డెల్ ఇన్సిపిరాన్ 620తో పాటు లభిస్తుంది.

ఇక డెల్ ఇన్సిపిరాన్ 620 లభించే కలర్స్ Solid White, Deep Purple, Formosa Red and Peacock Blue. ఇక చుట్టుకొలతలను గనుక చూసినట్లేతే 14.9-inch (ఎత్తు) x 4.2-inch (వెడల్పు) x 17.01-inch (లోతు)గా కలిగి ఉంది.డెల్ క్యాబినెట్ కూడా కంప్యూటర్‌తో పాటు ఉన్న స్పేస్‌ని బట్టి అనుకూలంగా ఉంటుంది. కంప్యూటర్‌తో పాటు 4 రబ్బర్ స్టాండ్స్‌ని అడుగు భాగాన మరియు కుడి వైపున ఇవ్వడం జరిగింది.

డెల్ ఇన్సిపిరాన్ 620 ఫీచర్స్‌ని చూసినట్లేతే ఇంటెల్ సెకండ్ జనరేషన్ 3.30 GHz Intel Core i3-2120M (Sandy Bridge) ప్రాసెసర్, DDR3 RAM of 4GB, AMD Radeon HD 6450 awesome GPU and 1 TB HDDలతో మార్కెట్లో లభ్యమవుతుంది. వీటితోపాటు అదనంగా కంప్యూటర్ వెనుక భాగంలో 6 USB 2.0 ports, HDMI port, VGA port, Gigabit Ethernet port లను కలిగి ఉంది. ఈ సిస్టమ్‌లో విండోస్ 7 హోం ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టమ్‌ ఇనిస్టాల్ చేయడం పాటు, మైక్రోసాప్ట్ ఆఫీస్ 2010కి సంబంధించిన సాప్ట్ వేర్‌ని కూడా ఇనిస్టాల్ చేయడం జరిగింది.

యూజర్స్‌కు గ్రేట్ ఎక్స్ పీరియన్స్‌ని వీడియోలు చూడడంలో అందిస్తుంది. వీటితో పాటు అదనంగా గేమింగ్ ఎక్స్ పీరియన్స్, స్కైపీ లాంటి అత్యాధునిక పీచర్స్ అన్నింటిని కూడా ఇందులో పోందుపరచడం జరిగింది.గ్రాఫిక్స్ కార్డ్‌ని అప్ గ్రేడ్ చేసుకునే వెసులుబాటు కూడా కల్పించడం జరిగింది. ఇందులో ఉన్న మేజర్ డ్రాబ్యాక్ ఏమిటంటే ఫ్లిఫ్ ప్యానల్స్. ఇంత అత్యంత అధ్బుతంగా తీర్చిదిద్దిన ఈ డెల్ ఇన్సిపిరాన్ 620 ధర(స్పీకర్స్, వ్యాట్ టాక్స్ అన్ని కలుపుకోని) సుమారుగా రూ 36,000గా నిర్ణయించడం జరిగింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot