‘డెల్’ కోసం ఎగబడుతున్నారు..?

Posted By: Prashanth

‘డెల్’ కోసం ఎగబడుతున్నారు..?

 

అవును.. మీరు వింటున్నది నిజమే, డెల్ ఉత్పత్తుల కోసం జనం ఎగబడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణను మూటకుట్టుకున్న ఈ ప్రముఖ వినూత్న కంపెనీ నాన్‌స్టాప్‌గా దూసుకుపోతుంది. హై క్వాలిటీ కంప్యూటింగ్ ఉత్పత్తులను రూపొందించటమే లక్ష్యంగా డెల్ నిర్విరామంగా శ్రమిస్తోంది. ఈ బ్రాండ్ తాజాగా విడుదల చేసిన ‘ఇన్స్‌పిరాన్ N5050’ ల్యాప్‌టాప్ ప్రత్యేక లక్షణాలను సంతరించుకుంది.

విండోస్ 7 హోమ్ బేసిక్ SP1 64-బిట్ ఆపరేటింగ్ సిస్టం పై ఈ ల్యాపీ రన్ అవుతుంది. ప్రాసెసింగ్ వ్యవస్థను మరింత పటిష్టితం చేస్తూ సెకండ్ జనరేషన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్లను డివైజ్‌లో నిక్షిప్తం చేశారు. వినియోగదారులు తమ పని సామర్ధ్యాన్ని బట్టి i3 లేదా i5 వర్షన్ ప్రాసెసర్లను ఎంపిక చేసుకోవచ్చు. 1333MHz సామర్ధ్యం గల ర్యామ్ వేగవంతంగా స్పందిస్తుంది. ఇంటెల్ HM67 ఎక్స్ ప్రెస్ చిప్‌సెట్‌ను ల్యాపీలో దోహదం చేశారు.

డివైజ్ డిస్‌ప్లే పరిమాణం 15.6 అంగుళాలు, పొందుపరిచిన హై డెఫినిషన్ వ్యవస్థ విజువల్ నాణ్యతను మరింత మన్నికతో అందిస్తుంది. నిక్షిప్తం చేసిన ఇంటెల్ హై డెఫినిషన్ గ్రాఫిక్స్ 3000 వీడియో కార్డ్ గ్రాఫిక్ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. హార్డ్‌డ్రైవ్ సామర్ధ్యం 500 జీబి, సుపీరియర్ ఆడియో క్వాలిటీనందించే 2 వాట్ సామర్ధ్యం గల ఆడియో స్పీకర్లను ల్యాపీలో అనుసంధానం చేశారు. ఏర్పాటు చేసిన శక్తివంతమైన 6 సెల్ 2.2 AHr లయోన్ బ్యాటరీ వ్యవస్థ దీర్ఘకాలీక బ్యాకప్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటంది.

పొందుపరిచిన 802.11 b/ g/n వై-ఫై ఇంటర్నెట్ కనెక్టువిటీని వేగిరితం చేస్తుంది. కనెక్టువిటీ వ్యవస్థలైన బ్లూటూత్, యూఎస్బీ 2.0లు డేటాను వేగవంతంగా ట్రాన్స్‌ఫర్ చేస్తాయి. ల్యాపీ బరువు 2.37 కిలో గ్రాములు. నలుపు, ఆపిల్ ఎరుపు రంగుల్లో ఈ ల్యాప్‌టాప్‌లు డిజైన్ కాబడ్డాయి.

భారతీయ మార్కెట్లో డెల్ ఇన్స్‌పిరాన్ N5050 ధర రూ.32,000 (అంచనా మాత్రమే).

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot