డెల్ రేంజ్ పెరిగింది..?

Posted By: Prashanth

డెల్ రేంజ్ పెరిగింది..?

 

అవును.. మీరు వింటున్నది నిజమే, డెల్ ఉత్పత్తులకు మార్కెట్ పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణను చొరగున్న ఈ ప్రముఖ గ్యాడ్జెట్ తయారీ కంపెనీ దూసుకుపోతుంది. హై క్వాలిటీ కంప్యూటింగ్ ఉత్పత్తులను ప్రపంచానికి అందించటమే లక్ష్యంగా డెల్ శ్రమిస్తోంది. ఈ బ్రాండ్ తాజాగా విడుదల చేసిన ‘ఇన్స్‌పిరాన్ N5050’ ల్యాప్‌టాప్ ప్రత్యేక లక్షణాలను సంతరించుకుంది.

విండోస్ 7 హోమ్ బేసిక్ SP1 64-బిట్ ఆపరేటింగ్ సిస్టం పై ఈ ల్యాపీ రన్ అవుతుంది. ప్రాసెసింగ్ వ్యవస్థను మరింత పటిష్టితం చేస్తూ సెకండ్ జనరేషన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్లను డివైజ్‌లో నిక్షిప్తం చేశారు. i3,i5 వేరియంట్ లలో ఈ ప్రాసెసర్లు లభ్యమవుతున్నాయి. ల్యాపీలో నిక్షిప్తం చేసిన 1333MHz ర్యామ్ వ్యవస్థ డివైజ్ పనివేగాన్నివేగవంతం చేస్తుంది.

డివైజ్ డిస్‌ప్లే పరిమాణం 15.6 అంగుళాలు కలిగి ఉంటుంది. పొందుపరిచిన హై డెఫినిషన్ వ్యవస్థ విజువల్ నాణ్యతను మరింత పెంచుతుంది. నిక్షిప్తం చేసిన ఇంటెల్ హై డెఫినిషన్ గ్రాఫిక్స్ 3000 వీడియో కార్డ్ గ్రాఫిక్ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. హార్డ్‌డ్రైవ్ సామర్ధ్యం 500 జీబి, సుపీరియర్ ఆడియో క్వాలిటీనందించే 2 వాట్ సామర్ధ్యం గల ఆడియో స్పీకర్లను ల్యాపీలో ఏర్పాటు చేశారు. శక్తివంతమైన 6 సెల్ 2.2 AHr లయోన్ బ్యాటరీ వ్యవస్థ దీర్ఘకాలీక బ్యాకప్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటంది.

పొందుపరిచిన 802.11 b/ g/n వై-ఫై వ్యవస్థ హై స్పీడ్ నెట్ బ్రౌజింగ్ కు తోడ్పడుతుంది. కనెక్టువిటీ వ్యవస్థలైన బ్లూటూత్, యూఎస్బీ 2.0లు ల్యాపీలోని డేటాను వేగవంతంగా ట్రాన్స్‌ఫర్ చేస్తాయి. భారతీయ మార్కెట్లో డెల్ ఇన్స్‌పిరాన్ N5050 ధర రూ.32,000 (అంచనా).

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting