‘డెల్ ఇన్సిఫిరాన్ వన్ 2310 పీసీ’ విడుదల..!!

Posted By: Staff

‘డెల్ ఇన్సిఫిరాన్ వన్ 2310 పీసీ’ విడుదల..!!


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిసెంబర్‌లో విసరబోతున్న ‘పంజా’కు ముందే, ప్రముఖ కంప్యూటర్ పీసీల తయారీదారు ‘డెల్’ తన పోటీ బ్రాండ్లకు సవాల్‌గా, వినియోగదారులకు పండగ కానుకుగా ‘పంజా’ను జులిపించింది. ‘వన్ 2310 పీసీ’ వర్షన్‌లో, అత్యాధునిక మల్టీ టచ్ వ్యవస్థలతో కూడిన కంప్యూటర్ పరికరాన్ని డెల్ ప్రవేశపెట్టింది.

దిగ్గజ సాంకేతిక పరికరాల తయారీదారు ‘డెల్’ గురించి ఎంత చర్చించుకున్నా తక్కువే. మారుతున్న సాంకేతికతకు, మన్నికను జోడించి బ్రాండ్ చేస్తున్న ఒక్కో ఆవిష్కరణకు వినియోగదారుల నుంచి మంచి స్పందన లభిస్తుంది. తాజాగా ‘డెల్’ విడుదుల చేసిన ‘డెల్ ఇన్సిఫిరాన్ వన్ 2310 పీసీ’ (Dell Inspiron One 2310 PC) ఫీచర్లను క్లుప్తంగా పరిశీలిద్దాం.

- పీసీ, 23 అంగుళాల మల్టీ టచ్ స్క్రీన్ వ్యవస్థను కలిగి ఉంటుంది.

- ఏర్పాటు చేసిన కోర్ i5 ప్రాసెసింగ్ వ్యవస్థ వేగవంతమైన పనితీరును వినియోగదారుడికి అందిస్తుంది.

- హై పవర్ ప్రాసెసింగ్ వ్యవస్థలు పీసీలో కావాలనుకున్న వారికి ‘ఇంటెల్ కోర్ i7 ప్రాసెసింగ్’ వర్షన్‌లో గ్యాడ్జెట్ లభ్యమవుతుంది.

- పీసీలో ఏర్పాటు చేసిన రాడియన్ గ్రాఫిక్ మరియు ‘బ్లూ - రే’ ఫీచర్లు వింత అనుభూతలకు లోను చేస్తాయి.

- పీసీలో పొందుపరిచిన ‘హై డెఫినిషన్’ వ్యవస్థ నాణ్యమైన క్లారిటీతో కూడిన అనుభూతిని శ్రోతకు కలిగిస్తుంది.

- కుటుంబ సమేతంగా ధియోటర్ అనుభూతితో కూడిన సినిమాలను ఈ పీసీ ద్వారా వీక్షించవచ్చు.

- వైర్‌లెస్ ‘మౌస్’, వైర్‌లెస్ ‘కీ’ ప్యాడ్లు డెల్ సాంకేతికతకు అద్దంపడతాయి.

- 2 జీబీ ర్యామ్ వ్యవస్థను 8జీబీ వరకు వృద్ధి చేసుకునే సౌలభ్యతను కల్పించారు.

- 500జీబీ హార్డ్‌డ్రైవ్ వ్యవస్ధను ఎక్స్‌ప్యాండబుల్ విధానం ద్వారా 1.0 ట్యాబ్ వరకు పెంచుకోవచ్చు.

- పీసీలో అనుసంధానించిన ‘న్విడియా జీ‌ఫోర్స్ GT525M’ మన్నికైన గ్యేమింగ్‌కు ఉపకరిస్తుంది.

- సౌండ్ వ్యవస్థను మరింత పటిష్టపరుస్తూ ‘జేబీఎల్’ (JBL) ఇంటర్నల్ స్పీకర్లను పీసీతో పొందవచ్చు.

- టీవీ ట్యూనర్ సాయంతో ‘టెలివిజన్ కార్యక్రమాలను’ రికార్డు చేసుకుని వీక్షించవచ్చు.

- అత్యాధునిక ఫీచర్లతో డిజైన్ చేయబడిన ‘డెల్ ఇన్సిఫిరాన్ వన్ 2310 పీసీ’ గ్యాడ్జెట్ల స్టోర్లలో రూ.47,000కు లభ్యమవుతుంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting