సల్మాన్ ఖాన్ రె‘ఢీ’ తో హిట్ కొడితే, ‘ఆర్’ తో దుమ్ముదులిపేందుకు...!!

Posted By: Staff

సల్మాన్ ఖాన్ రె‘ఢీ’ తో హిట్ కొడితే, ‘ఆర్’ తో దుమ్ముదులిపేందుకు...!!

‘‘ సల్మాన్ ఖాన్ రె‘ఢీ’ సినిమాతో బాలీవుడ్ బక్సాఫీస్ ప్రభంజనం సృష్టిస్తే.. ప్రపంచ ఆల్ టైమ్ హిట్ బ్రాండ్ ‘డెల్’ ఆర్ సిరీస్ ల్యాప్‌టాప్‌‌లతో భారతీయ మార్కెట్ ను కొల్లగొట్టేందుకు సమాయుత్తమైంది.’’

మార్కెట్లో డెల్ ‘ఆర్’ సిరీస్ ల్యాప్‌టాప్‌‌లు విడుదలయ్యాయి. ఈ సిరీస్ కు సంబంధించి 14 అంగుళాల స్ర్కీన్ సైజులతో పాటు 15 అంగుళాల స్ర్కీన్ సైజు ల్యాప్‌టాప్‌‌లు అధునాతాన సెకండ్ జనరేషన్ ఇంటెల్ కోర్ ప్రొసెసింగ్ వ్యవస్థతో రూపుదిద్దుకున్నాయి. కళాత్మక పెయింటింగ్‌లతో ఆకర్షణీయంగా రూపోదించబడ్డ ఈ పరికరాలు ఫస్ట్‌లుక్‌లోనే ఆకట్టుకుంటాయనటానికి ఎటువంటి సందేహం లేదు.

నాణ్యమైన డిస్‌ప్లేతో పాటు కట్టింగ్ ఎడ్జ్ వ్యవస్థతో చూడముచ్చటగా ఉన్న ‘ల్యాపీ’లు పటిష్టమైన బ్యాటరీ వ్యవస్థను ఒదిగి ఉన్నాయి. ‘హై డెఫినిషన్ డిస్‌ప్లే’ ఈ ల్యాపీకి ప్రధానాకర్షణ. 4జీబీ మెమరీ ఆఫ్షన్ కలిగిన ‘ఆర్ సిరీస్’ గ్యాడ్జెట్లలో ముందుగానే హోమ్ విండోస్ 7 వ్యవస్థను లోడ్ చేశారు.
హై డెఫినిషన్ సామర్థ్యం కలిగిన ‘వెబ్ క్యామ్’, మ్యూజిక్, వీడియో వంటి గ్యాలరీ కంటెంట్లను సపోర్టు చేసే సాఫ్ట్ వేర్ వ్యవస్థ వినియోగదారునికి మరింత లబ్ధి చేకూరుస్తుంది.

ముందుగానే లోడ్ చేసిన ఆప్లికేషన్లు ఫేస్ బుక్, ట్విట్టర్, మై స్పేస్, ఇ - బుక్ వంటి సౌలభ్యతలు ఒక్క క్లిక్‌తో స్ర్కీన్ ముందు ప్రత్యక్షమవుతాయి. అదరగొట్టే స్థాయిలో రూపొందించబడ్డ చిక్‌లెట్ స్టైల్ కీ బోర్డు, పని వేగాన్ని మరింత పెంచుతుంది. 6 సెల్ బ్యాటరీ వ్యవస్థ సుదీర్ఘ మన్నికను కలిగి ఉంటుంది. ల్యాప్‌టాప్‌‌లో పొందుపరిచిన బ్లూరే 3డీ ప్లే బ్యాక్ డ్రైవ్‌ను, మీ 3డీ టీవికి అనుసంధానం చేసుకోవచ్చు.

డెల్ భారతీయ సంస్ధ ఏర్పాటు చేసిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో డెల్ ఇండియా జనరల్ మేనేజర్, మహేష్ బల్లా మాట్లాడుతూ వినియోగదారుని జీవన శైలికి సరితూగే విధంగా అధునాతన సాంకేతికతతో తమ బ్రాండ్ పరికరాలను అందించేందుకు దృష్టి సారించినట్లు తెలిపారు. 10 రకాల డిజైన్లలో తమ సరికొత్త ‘ఆర్ సిరీస్’ మార్కెట్లో లభ్యమవుతన్నట్లు ఆయన తెలిపారు. వీటి ధరలన పరిశీలిస్తే సరికొత్త డెల్ ‘ఆర్’ సరీస్ 14 అంగుళాల ల్యాపీ రూ.34,000కు, 15 అంగుళాల ల్యాపీ రూ.35,000కు లభ్యమవుతున్నాయి. ఈ ల్యాప్‌టాప్‌‌లను ఆన్ లైన ద్వారా బుక్ చేసుకునేందుకు డెల.కో.ఇన్ లోకి లాగిన్ అవచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot