సాఫ్టేవేర్ నుంచి స్కూల్ పిల్లల వరకు..!!

Posted By: Staff

సాఫ్టేవేర్ నుంచి స్కూల్ పిల్లల వరకు..!!


‘‘కంప్యూటింగ్ పరికరాల మార్కెట్లో అమ్మకాల వాటాను అంచెలంచెలుగా కైవసం చేసుకుంటున్న ఆధునిక నెట్‌‌బుక్ పరికరాలకు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల దగ్గర నుంచి స్కూల్ పిల్లల వరకు అనూహ్య ఆదరణ లభిస్తుదంది. ల్యాపీ తరహా దర్శనమిచ్చే ఈ బుల్లి సాంకేతిక యంత్రంలో దాగోన్న అనువైన ఫీచర్లు యువతతో సహా, వ్యాపారావేత్తలకు మరింత లబ్ధి చేకూరుస్తున్నాయి.’’

దిగ్గజ సాంకేతిక పరికరాల తయారీదారు డెల్ ప్ర్రవేశపెట్టిన అత్యాధినిక నెట్‌బుక్ ‘లాటిట్ట్యూడ్ 2120’ ప్రస్తుత నెట్‌బుక్‌ల మార్కెట్లో హాట్ టాపిక్, ప్రస్తుత తరానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానంతో పాటు, యువత కోరుకునే స్టైల్‌ను ఈ పరికరాల్లో మేళవించారు.

క్లుప్తంగా ‘లాటిట్ట్యూడ్ 2120’ ఫీచర్లు:

- రెండు మోడళ్లలో ‘లాటిట్ట్యూడ్ 2120’ నెట్‌బుక్‌లను డెల్ ప్రవేశపెట్టింది. దిగువ, మధ్యతరగతి శ్రేణులతో పాటు హై క్లాస్ వినియోగదారులను ఆకర్షించే విధంగా వీటి ధరలు ఉంటాయి.

- ఈ నెట్‌బుక్ పరికరాలు 250జీబీ హార్డ్ డిస్క్ డ్రైవ్‌లను కలిగి ఉంటాయి.

- ధర తక్కువు కలిగిన ‘లాటిట్ట్యూడ్ 2120’ మోడల్‌లో ‘సింగిల్ కోర్ ఆటమ్ N455 ప్రొసెసర్‌తో పాటు 1జీబీ ర్యామ్ వ్యవస్థను పొందుపరిచారు’. ‘యుబుంటు’ (Ubuntu) ఆపరేటింగ్ వ్యవస్థ ఆధారితంగా ఈ మోడల్ నెట్‌బుక్ పని చేస్తుంది.

- ధర ఎక్కువ కలిగిన ‘లాటిట్ట్యూడ్ 2120’ నెట్‌బుక్ మోడల్ విండోస్ 7 హోమ్ ప్రీమియమ్ ఆపరేటింగ్ వ్యవస్థ ఆధారితంగా పనిచేస్తుంది. ఇంటెల్‌కోర్ ఆటమ్ డ్యూయల్ కోర్ N550 ప్రొసెసర్, 2జీబీ ర్యామ్ వంటి వ్యవస్థులు మన్నికైన సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి.

- రబ్బర్ ఆధారిత (రబ్బరైజుడ్ బాడీని) ఈ నెట్‌బుక్‌ల నిర్మాణంలో పొందుపరిచారు. కేవలం 3.1 పౌండ్ల బరువును మాత్రమే కలిగి ఉండే ఈ స్మార్ట్ పరికరాలు మన్నికైన 56 Watt బ్యాటరీ వ్యవస్థను కలిగి ఉంటాయి.

- ఏర్పాటు చేసిన కీ బోర్డు వ్యవస్ధ వేగవంతమైన టైపింగ్‌కు ఉపకరిస్తుంది. ఏర్పాటు చేసిన హై డెఫినిషన్ సామర్ధ్యం గల వెబ్ క్యామ్ నాణ్యమైన వీడియో ఛాటింగ్‌కు ఉపకరిస్తుంది.

- నెట్‌బుక్‌లో పొందుపరిచిన హై డెఫినిషన్ వ్యవస్థ వీడియోలను నాణ్యమైన అనుభూతితో ప్లే చేస్తుంది.

- లౌడ్‌స్పీకర్ వ్యవస్థ కాస్తంత నిరుత్సాహా పరిచినప్పటికి, పొందుపరిచిన హై డెఫినిషన్ వ్యవస్థ ఆ వెలితిని పూడుస్తుంది.

- పటిష్టమైన జిగా బైట్ ఇతర్ నెట్, వై-ఫై, v2.0 యూఎస్బీ పోర్టు, వీజీఏ కనెక్టర్ వంటి అంశాలు సమాచార వ్యవస్థను మరింత వేగవంతం చేస్తాయి.

- చివరిగా ధర అంశాలను పరిశీలిస్తే ఇండియన్ మార్కెట్లో రూ.20,000 నుంచి ఈ నెట్ బుక ధరలు ప్రారంభమవుతున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot