‘కార్పొరేట్’ రంగం పై కన్నేసిన పెద్దన్న..?

Posted By: Prashanth

‘కార్పొరేట్’ రంగం పై కన్నేసిన పెద్దన్న..?

 

‘కార్పొరేట్ రంగం పై పెద్దన్న కన్ను పడింది..?, ఆకర్ష్ మంత్రాన్ని ప్రయోగించేందుకు అస్ర్తాలు ఊపందుకున్నాయి..?, ఆ అదినాయకుడు విజయం సాధిస్తాడా.. చరిత్ర సృష్టించగలడా..?’. కార్పొరేట్ అవసరాలకు పూర్తి స్థాయిలో దోహదపడే విధంగా దిగ్గజ శ్రేణి సంస్థ ‘డెల్’(Dell) ఫీల్‌గుడ్ ల్యాప్‌టాప్‌ను రూపొందించింది. తొలి చూపులోనే ఆకట్టుకుంటున్న ఈ స్మార్ట్ లుకింగ్ ‘లాటిట్యూడ్ E6220’ అంచనాలకు మించి ఉంటుందని విశ్లేషక వర్గాలు ప్రశంసిస్తున్నాయి.

‘లాటిట్యూడ్ E6220’ ముఖ్య ఫీచర్లు:

* ల్యాపీ బరువు కేవలం 1.7 కిలో గ్రాములు, * డిస్ ప్లే 12.5 అంగుళాలు, * విండోస్ 7 ఆపరేటింగ్ వ్యవస్థ, * వినియోగదారుడి ఎంపికను బట్టి ఇంటెల్ కోర్ i5-2540 లేదా i7-2630M ప్రాసెసింగ్ వ్యవస్థను డివైజ్ లో నిక్షిప్తం చేస్తారు, * హై డెఫినిషన్ 3000 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, * 1080 పిక్సల్ సామర్ధ్యం గల వీడియో ప్లేబ్యాక్, * ఇంటర్నల్ బ్యాటరీ బ్యాకప్ 7 గంటల 30 నిమిషాలు, * అడిషనల్ బ్యాటరీ బ్యాకప్ 20 గంటలు, * 128జీబీ సామర్ధ్యం గల సాలిడ్ స్టేట్ డ్రైవ్, * సిస్టం మెమరీ 4 నుంచి 8జీబి మధ్య, * eSATA/USB కాంబో పోర్ట్, * యూఎస్బీ 2.0 పోర్ట్స్, * హెచ్డీఎమ్ఐ పోర్ట్, * జిగాబిట్ ఇతర్ నెట్, * బ్లూటూత్, * వెబ్ క్యామ్, * ఎక్స్‌ప్రెస్ కార్డ్ స్లాట్, * హెడ్‌ఫోన్ జాక్, * ఇండియన్ మార్కెట్లో ‘డెల్ లాటిట్యూడ్ E6220’ ధర రూ.75, 000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot