‘డెల్’ ప్రపంచంలో ఏం జరుగుతోంది..?

Posted By: Staff

‘డెల్’ ప్రపంచంలో ఏం జరుగుతోంది..?

 

దిగ్గజ కంప్యూటింగ్ పరికరాల తయారీదారు ‘డెల్’ తాజాగా రెండు టాబ్లెట్ పీసీలను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ‘డెల్ లాటిట్యూడ్ ఎస్టీ’ (ST), ‘డెల్ స్ట్ర్రీక్ 7’ వర్షన్ లలో రూపొదిద్దుకున్న ఈ గ్యాడ్జెట్లు అత్యాధునిక స్పెసిఫికేషన్లతో వినియోగదారులకు మరింత లబ్ధి చేకూరుస్తాయి.

- డెల్ లాటిట్యూడ్ ఎస్టీ టాబ్లెట్ స్క్రీన్ 10.1 అంగుళాలు, విండోస్ 7 ఆపరేటింగ్ వ్యవస్థను ఈ పీసీలో లోడ్ చేశారు. బరువు 816 గ్రాములు, ఇంటెల్ ఆటమ్ Z670 1.5GHz ప్రాసెసర్, 3జీ కనెక్టువిటీ, 2జీబీ ఎక్సటర్నల్ మెమరీ ర్యామ్, SSD విధానం ద్వారా జీబీని 32కు పెంచుకోవచ్చు. 5.0 మెగా పిక్సల్ రేర్ కెమెరా, అత్యాధునిక సెక్యూరిటీ మరియు కనెక్టువిటీ ఫీచర్లు, సోషల్ నెట్ వర్కింగ్ మరియు ఎంటర్‌టైన్‌మెంట్ అప్లికేషన్లను పీసీలో ముందుగానే అప్ లోడ్ చేశారు. ధర.35,000.

- డెల్ స్ట్ర్రీక్ 7 టాబ్లెట్ పీసీ స్క్రీన్ 7 అంగుళాలు, ఆండ్రాయిడ్ 2.2 ఫ్రోయో ఆపరేటింగ్ వ్యవస్థను లోడ్ చేశారు. ఏర్పాటు చేసిన ఆండ్రాయడ్ మార్కెట్ ప్లేస్ వ్యవస్థ వినియోగదారుడికి మరింత ఉపయుక్తంగా నిలుస్తుంది. 3జీ సౌలభ్యత, బ్లూటూత్, వైఫై, లాన్ వంటి కనెక్టువిటీ అంశాలు డేటా ట్రాన్సఫరింగ్ వ్యవస్ధను మరింత వేగవంతం చేస్తాయి. 5మెగా పిక్సల్ రేర్, 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా వ్యవస్థలు నాణ్యమైన ఫోటోలతో పాటు వీడియోలు చిత్రీకరించేందుకు సౌకర్యవంతంగా ఉపయోగపడతాయి. సోషల్ నెట్ వర్కింగ్ మరియు ఎంటర్‌టైన్‌మెంట్ అప్లికేషన్లను పీసీలో ముందుగానే అప్ లోడ్ చేశారు. ధర.25,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot