ఆ రెండు వర్గాలే టార్గెట్?

Posted By: Prashanth

ఆ రెండు వర్గాలే టార్గెట్?

 

మన్నికతో కూడిన కంప్యూటింగ్ పరికరాలను రూపొందించే డెల్ మరో ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. ‘డెల్ లాటిట్యూడ్ 6430యూ’ మోడల్‌లో ఓ సరికొత్త అల్ట్రాబుక్‌ను ఈ బ్రాండ్ తయారుచేసింది. ప్రధానంగా రెండు వర్గాలను పరిగణంలోకి తీసుకుని వారికి అనువుగా ఈ గ్యాడ్జెట్‌‌ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. వ్యాపారస్థులు అదేవిధంగా వివిధ ప్రాంతాలకు ప్రయాణిస్తూ నిత్యం కంప్యూటింగ్ లావాదేవీలలో తనమునకలయ్యే వారికి ఈ డివైజ్ అనువైన ఫీచర్లలతో చురుకైన కంప్యూటింగ్‌ను ఉత్పత్తి చేస్తుంది. 14 అంగుళాల డిస్‌ప్లే స్ర్కీన్

(1366×768పిక్సల్) రిసల్యూషన్‌ను కలిగి ఉంటుంది. ల్యాపీ బరువు 1.74 కిలోగ్రాములు. సౌకర్యవంతమైన డిజైనింగ్. ప్రయాణ సందర్భాల్లో ఈ గ్యాడ్జెట్‌ను మోసుకెళ్లటం మరింత సులువు.

యూజర్ ఎంపికను బట్టి ల్యాపీలో ఇంటెల్ ఐ3, ఐ5, ఐ7 ఐవీ బ్రిడ్జ్‌సెట్‌లను నిక్షిప్తం చేస్తారు. వేగవంతమైన ప్రాసెసింగ్‌కు ఇవి తోడ్పడతాయి. ప్రాధమికంగా పొందుపరిరచిన 8జీబి ర్యామ్,256జీబి ఎస్ఎస్‌డీ డ్రైవ్‌లను అవసరాన్ని బట్టి పెంచుకోవచ్చు. డివైజ్‌లో ఏర్పాటు చేసిన స్టాండర్డ్ వై-ఫై, కనెక్టువిటీ సామర్ధ్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది. యూఎస్బీ కనెక్టువిటీ డేటాను సమర్థవంతంగా ట్రాన్స్‌ఫర్ చేస్తుంది.

విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టం పై ల్యాపీ రన్ అవుతుంది. అమర్చిన వెబ్‌క్యామ్ ఉత్తమ క్వాలిటీ ఛాటింగ్ అనుభూతిని చేరువ చేస్తుంది. గ్యాడ్జెట్ ఇతర హార్డ్‌వేర్ , సాఫ్ట్‌వేర్ స్పెసిఫికేషన్‌లకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సెక్యూరిటీ అంశాలను పరిశీలిస్తే ఏర్పాటు చేసిన ఫింగర్ ప్రింట్, స్మార్ట్ కార్డ్‌రీడర్, డేటా ప్రొటక్షన్ సాఫ్ట్‌వేర్ వంటి అంశాలు డివైజ్ భద్రతను కట్టుదిట్టం చేస్తాయి. ‘లాటిట్యూడ్ 6430యూ’ ఖచ్చితమైన విడుదలకు సంబంధించి సమాచారం తెలియాల్సి ఉంది. ఆధునిక హంగులతో విడుదల కాబోతున్న ఈ డివైజ్ అల్ట్రాబుక్ విభాగంలో కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తుందని డెల్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot