Home
Computer

Dell నుంచి కొత్తగా మూడు ల్యాప్‌టాప్‌లు విడుదల.. ఫీచర్‌లు, ధర, సేల్‌ పూర్తి వివరాలు..!

ప్రముఖ కంప్యూటర్‌లు, ల్యాప్‌టాప్‌ల తయారీ సంస్థ Dell ఈ సంవత్సరం ప్రారంభంలో కీలక ప్రకటన చేసింది. రీబ్రాండింగ్‌లో భాగంగా డెల్‌ ప్లస్‌, డెల్‌ ప్రో, డెల్‌ ప్రో మ్యాక్స్‌ సిరీస్ పేర్లలో కొత్త PC లు లాంచ్‌ కానున్నాయని తెలిపింది. ఇందులో భాగంగా తాజాగా Dell Plus ల్యాప్‌టాప్‌లను భారత్‌ మార్కెట్‌ లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో మూడు వేరియంట్స్‌ ఉన్నాయి. Dell 14 Plus, Dell 14 2 ఇన్‌ 1 ప్లస్‌, Dell 16 ప్లస్‌ PC లు విడుదల అయ్యాయి.

ఈ డెల్‌ కొత్త PC లు ఇంటెల్‌ కోర్‌ అల్ట్రా సిరీస్‌ 2 ప్రోసెసర్‌లతోపాటు ఇంటెల్‌ ఆర్క్‌ గ్రాఫిక్స్‌తో పనిచేస్తాయి. రోజువారీ పనులు, క్రియేటివ్‌ టాస్క్‌లకు ఈ ల్యాప్‌టాప్‌లు అనుకూలంగా ఉంటాయని సంస్థ చెబుతోంది. దీంతోపాటు ఈ ల్యా్‌ప్‌టాప్‌లు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత ఫీచర్‌లను కలిగి ఉన్నాయి. ఈ ల్యాప్‌టాప్స్‌లో వినియోగించిన చిప్‌సెట్‌ మల్టీ టాస్కింగ్‌ సహా ఫోటో, వీడియో ఎడిటింగ్‌ సమయంలో మెరుగైన పనితీరు కనబరుస్తుందని డెల్‌ చెబుతోంది.

Dell launched Dell plus laptops in india telugu news

డెల్ 14 ప్లస్‌ ల్యాప్‌టాప్‌ :
ఈ ల్యాప్‌టాప్‌ గత మోడల్స్‌ తో పోలిస్తే 11 శాతం సన్నని ఛాసెస్‌ను కలిగి ఉంటుందని డెల్‌ చెబుతోంది. మరియు ఈ పీసీ QHD+ 16:10 డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ ల్యాప్‌టాప్‌ను ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేస్తే గరిష్ఠంగా 22 గంటల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుందని సంస్థ చెబుతోంది.

ఈ ల్యాప్‌టాప్‌ అల్ట్రా సిరీస్‌ 2 ప్రోసెసర్‌, ఇంటెల్‌ ఆర్క్‌ గ్రాఫిక్స్‌తో పనిచేస్తుంది. మరియు మెరుగైన ఆడియో అవుట్‌పుట్‌ కోసం డాల్బీ అట్మాస్‌, Waves MaxxAudio Pro సౌండ్‌ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. ఈ ల్యాప్‌టాప్‌ ధర రూ.1,15,799 గా ఉంది. ఈ ల్యాప్‌టాప్‌ 1.55 KG లుగా ఉంది.

Dell launched Dell plus laptops in india telugu news

డెల్‌ 14 2 ఇన్‌ 1 ప్లస్‌ ల్యాప్‌టాప్‌ :
ఈ ల్యాప్‌టాప్‌ ప్రత్యేక డిజైన్‌ కారణంగా అనేక విధాలుగా ఉపయోగించుకోవచ్చు. ల్యాప్‌టాప్‌, ట్యాబ్లెట్‌ కూడా వినియోగించుకోవచ్చు. ఈ ల్యాప్‌టాప్‌ అల్ట్రా సిరీస్‌ 2 ప్రోసెసర్‌, ఇంటెల్‌ ఆర్క్‌ గ్రాఫిక్స్‌తో పనిచేస్తుంది. దీని ధర రూ.96,899 గా ఉంది.

డెల్‌ 16 ప్లస్‌ ల్యాప్‌టాప్‌ :
ఈ ల్యాప్‌టాప్‌ 16 అంగుళాల ఫుల్‌ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు ఈ డిస్‌ప్లే 180 డిగ్రీల హింజ్‌ తోపాటు 300 నిట్స్‌ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ ల్యాప్‌టాప్‌ అల్ట్రా సిరీస్‌ 2 ప్రోసెసర్‌, ఇంటెల్‌ ఆర్క్‌ గ్రాఫిక్స్‌తో పనిచేస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌ను ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేస్తే 20 గంటల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌ ధర రూ.1,08,499 గా ఉంది.

ధర, సేల్‌ వివరాలు :
డెల్‌ నుంచి కొత్తగా విడుదల అయిన ల్యాప్‌టాప్‌లను క్రోమా, రిలయన్స్‌, విజయ్‌ సేల్స్‌, Dell.com వెబ్‌సైట్‌తో బాటు డెల్‌ స్టోర్‌ల నుంచి కొనుగోలు చేయవచ్చు. రోజువారీ పనులతోపాటు ఎడిటింగ్‌ టాస్క్‌ల కోసం ఈ ల్యాప్‌టాప్‌లు అనుకూలంగా ఉంటాయని డెల్ చెబుతోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Dell launched Dell plus laptops in india with intel Core ultra 2 Processor and intel arc graphics
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X