గందరగోళంలో ఫ్యాన్స్..?

Posted By: Super

గందరగోళంలో ఫ్యాన్స్..?

 

ల్యాప్‌టాప్ ప్రపంచంలో కొత్త ఒరవడికి నాందిపలుకుతూ డెల్ నూతన వేరియంట్‌లలో రెండు ల్యాపీలను డిజైన్ చేసింది. ప్రెసిషన్ సిరీస్ నుంచి రూపుదిద్దుకున్న ఈ కంప్యూటింగ్ డివైజుల మోడల్ నెంబర్లు ఎమ్6700, ఎమ్4700. ఎంపిక విషయంలో డెల్ అబిమానులను గందరగోళానికి గురి చేస్తున్నాయి. సమాంతరమైన ఉత్తమ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ స్పెసిఫికేషన్‌లతో ఈ గ్యాడ్జెట్‌లు డిజైన్ కాబడ్డాయి. ఆడ్వాన్స్ లెవల్ ఇంటెల్ ప్రాసెసర్లతో పాటు హై క్వాలిటీ గ్రాఫిక్ వ్యవస్థలను వీటిలో నిక్షిప్తం చేశారు. ముఖ్యంగా యువతను ఈ డివైజ్‌లు కట్టిపడేస్తాయి.

ఎమ్6700 కీలక స్పెసిఫికేషన్‌లు:

17.3 అంగుళాల డిస్‌ప్లే స్ర్కీన్,

ఇన్‌బుల్ట్ వెబ్ కెమెరా మైక్,

65వాట్ ఇంటెల్ ప్రాసెసర్,

1866 మెగాహెడ్జ్ ర్యామ్,

ఎన్-విడియా N14EQx గ్రాఫిక్ వ్యవస్థ.

HDD,SSDల కోసం రెండు స్లాట్‌లు,

ఈ ల్యాపీ మూడు డిస్‌ప్లే ఆప్షన్‌లను కలిగి ఉంటుంది. వీటిలో మొదటిది 3డి వైట్-ఎల్ఈడి, 2డీ ఎల్ఈడి, సాధారణ స్క్రీన్. హై డెఫినిషన్ వ్యవస్థ క్లారిటీతో కూడిన విజువల్స్‌ను విడుదల చేస్తుంది.

ఎమ్4700 కీలక ఫీచర్లు:

15.6 అంగుళాల డిస్‌ప్లే స్ర్కీన్,

ఇన్‌బుల్ట్ వెబ్ కెమెరా, వైక్,

55వాట్ ఇంటెల్ ప్రాసెసర్,

వై-ఫై సామర్ధ్యం,

1866మెగాహెడ్జ్ ర్యామ్,

2.5 అంగుళాల స్లాట్స్.

ఎన్-విడియా N14PQx గ్రాఫిక్ సపోర్ట్,

ఏఎమ్‌డి ఫైర్‌ప్రో ఎమ్4000 ఎక్స్‌ప్రెస్ కార్డ్‌సపోర్ట్.

ఉత్తమ శ్రేణిలో డిజైన్ కాబడిన ఈ ల్యాపీలు వినియోగదారుకు క్వాలిటీతో కూడిన యూజర్ ఫ్రెండ్లీ కంప్యూటింగ్‌ను అందిస్తాయి. నిక్షిప్తం చేసిన మల్టీమీడియా వ్యవస్థ అపరిమిత వినోదాలను చేరువచేస్తుంది. ఈ ల్యాపీలకు సంబంధించి ధర ఇతర వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot